»   » మళ్ళీ విలనిజాన్ని ప్రదర్శిస్తోన్న మైటీ స్టార్..

మళ్ళీ విలనిజాన్ని ప్రదర్శిస్తోన్న మైటీ స్టార్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

కెరీర్ మొదట్లో విలన్ క్యారక్టర్లు చేసిన శ్రీకాంత్ తదుపరి నెమ్మదిగా ఎదుగుతూ దర్శకుడు రాఘవేంద్ర రావు 'పెళ్లి సందడి" చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొందారు. తరువాత హీరోగా పలు హిట్ చిత్రాలలో నటించిన శ్రీకాంత్ అతి తక్కువ కాలంలో 100 చిత్రాలను పూర్తి చేశారు. ప్రస్తుతం అంతగా హిట్ లు లేని శ్రీకాంత్ తిరిగి విలన్ రోల్స్ చేస్తున్నాడట.

కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించి ఆపై కథానాయకుడిగా మారిన శ్రీకాంత్ కి ప్రస్తుతం హీరోగా హిట్స్ లేవు కనుక మళ్ళీ బ్యాక్ టు విలనిజం అంటున్నాడేమో అన్నట్టుంది కదూ ఆ పతాక శీర్షిక. కానీ విషయం అదికాదులెండి ఇప్పుడు ఓ వైపు రంగ ది దొంగ, ఇంకోవైపు సేవకుడు చిత్రాల్లోనూ నెగటివ్ షేడ్స్ కలిగుండే టిపికల్ రోల్స్ ని చేస్తాడట. ఆల్ రెడీ ఆ రెండు సినిమాలకూ 'గాడ్సే" - 'దుశ్శాసన" అనే టైటిల్స్ ని కన్ ఫర్మ్ చేశారు. మరి శ్రీకాంత్ మళ్ళీ విలన్ రోల్స్ కే అంకితమవుతాడో లేక హీరోగా నిలదొక్కుకుంటాడో చూద్దాం. కాగా ఆ రెండు ప్రాజెక్ట్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలయనున్నాయి..!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu