»   » శ్రీహరి బావమరిది ‘అగ్గి రవ్వ’ (హాట్ ఫోటోలు)

శ్రీహరి బావమరిది ‘అగ్గి రవ్వ’ (హాట్ ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటుడు శ్రీహరి బావమరిది జయరామ్ కథానాయకుడిగా ఓ సినిమా రాబోతోంది. శ్రీధన్ మీడియా పతాకంపై తమిళ, తెలుగు భాషల్లో ఎ.ఎల్.రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి 'అగ్గిరవ్వ' అనే టైటిల్ ఖరారు చేసారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

నిర్మాత ఎస్.భూపతి మాట్లాడుతూ- డిస్కోశాంతి తమ్ముడు జయరామ్‌ను ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం చేస్తున్నామని, విద్య అనేది ఎటువంటి భేదాలు లేకుండా అందరికీ లభించాలి, దానివల్ల అందరికీ ఉపయోగం ఉండాలి అని ఈ చిత్రంలో చూపిస్తున్నామని, విద్యను వ్యాపారంగా చేసుకున్న కొంతమంది దౌర్జన్యాలను తెరకెక్కించామని తెలిపారు.

మిగతా వివరాలు స్లైడ్ షోలో...

పరిష్కారం

పరిష్కారం

విద్య వ్యాపారం మారిందనే సమస్యను గుర్తించడం సులభం. కానీ దానికి పరిష్కారం చెప్పడం కష్టం. అటువంటి కష్టమైన పరిష్కారాన్ని తమ దర్శకుడు చిత్రంలో చూపారని,

ఆడియో విడుదల తేదీ

ఆడియో విడుదల తేదీ

చిత్రానికి సంబంధించిన పాటలు ఈనెల 23న విడుదల చేయనున్నామని నిర్మాత భూపతి తెలిపారు.

యాక్షన్, కామెడీతో

యాక్షన్, కామెడీతో

యాక్షన్, కామెడీ సన్నివేశాలతో పాటు పాటలు అందరికీ నచ్చుతాయని, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ముంబాయి తదితర ప్రాంతాల్లో పాటల చిత్రీకరణ జరిగిందని, అందరూ కలిసి చూడదగ్గ చిత్రమిదని చిత్ర దర్శకుడు కోమగన్ ఎ.ఎల్.రాజా తెలిపారు.

జులైలో విడుదల

జులైలో విడుదల

సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేస్తామని దర్శకుడు ఎఎల్ రాజా అన్నారు.

నటీనటుల, సాంకేతిక విభాగం

నటీనటుల, సాంకేతిక విభాగం

బ్రహ్మానందం, వత్సల, ఆశీష్ విద్యార్థి, భానుప్రియ, దండపాణి, రాజ్యలక్ష్మి, సుమన్‌శెట్టి, గుండు సుదర్శన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీకాంత్ దేవా, కెమెరా: శివరామ్, నిర్మాత: ఎస్.్భపతి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఎల్.రాజా.

English summary
Jayaram, who is the brother-in- law of late Srihari, is being introduced as a hero in the movie ‘Aggi Ravva’. The bilingual film is being directed by Komagan AL Raja under the banner Sridhar Media with S Bhupathi as producer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X