For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ముందే రానున్న అఙ్ఞాత వాసి: పవన్ త్రివిక్రమ్ మూవీ కొత్త రిలీజ్‌డేట్ ఇదే

  |
  Pawan Kalyan's 'Agnathavasi' Movie Release Date Planned Earlier

  పవన్‌ కళ్యాణ్‌ కొత్త చిత్రం 'అజ్ఞాతవాసి' విడుదలకు ముహూర్తం ఖరారైంది. పవర్‌స్టార్‌ నటిస్తున్న 25వ సినిమా కావడం 'అజ్ఞాతవాసి' ప్రత్యేకత. దర్శకుడు త్రివిక్రమ్‌తో హ్యాట్రిక్‌ చిత్రం కావడం మరో విశేషం. టాప్ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే... వాటికి సంబంధించిన అప్ డేట్స్ తో సోషల్ మీడియాలో సందడి చేయడం ప్రస్తుతం షరామామూలైపోయింది. బాగా క్రేజ్ వచ్చినటువంటి 'అర్జున్ రెడ్డి' సినిమాలే ఒక ట్రెండ్ ను సృష్టించగా, ఇక పవన్, మహేష్ వంటి స్టార్ హీరోల సినిమాలకు ఏ రేంజ్ లో హంగామా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇటీవల విడుదలైన ప్రిన్స్ 'స్పైడర్' సందర్భంలోనూ... ఈ సినిమా టైటిల్ లోగో డిజైన్ తో మహేష్ అభిమానులంతా సోషల్ మీడియాలో హోరెత్తించారు. ఇక ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ వంతు వచ్చింది.

  15 రోజుల యూరప్‌ పర్యటన

  15 రోజుల యూరప్‌ పర్యటన

  ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ అనిరుధ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ బిట్ వీడియో - హీరోయిన్ కీర్తి సురేశ్ -పవన్ ల లుక్స్ ...ఈ సినిమా పై అంచనాలు మరింత పెంచాయి. హారికా హాసినీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం...దీపావళి పండగకు ముందు మూడు రోజుల చిత్రీకరణ జరుపుకుంది. త్వరలో 15 రోజుల యూరప్‌ పర్యటనకు వెళ్తోంది.

  డిసెంబర్‌ రెండో వారం నుంచి

  డిసెంబర్‌ రెండో వారం నుంచి

  ఇద్దరు నాయికలు అనూ ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేష్‌తో పవన్‌ పాల్గొనే ఈ షెడ్యూల్‌తో ‘అజ్ఞాతవాసి' చిత్రీకరణ పూర్తవుతుంది. షూటింగ్‌తో సమానంగా నిర్మాణాంతర కార్యక్రమాలూ జరుగుతున్నాయి. కాబట్టి పోస్ట్‌ ప్రొడక్షన్‌కు పెద్దగా సమయం తీసుకోకపోవచ్చు. డిసెంబర్‌ రెండో వారం నుంచి తగినంత ప్రచార కార్యక్రమాలు జరిపి చిత్రాన్ని అన్నివిధాలా విడుదలకు సిద్ధం చేయాలని యూనిట్‌ భావిస్తోంది. సంక్రాంతి పండగ సందర్భంగా ‘అజ్ఞాతవాసి' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

   సంక్రాంతి కానుకగా

  సంక్రాంతి కానుకగా

  ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను ఒక రోజు ముందుగానే విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. 'అజ్ఞాతవాసి'సినిమా తర్వాత పవన్ ...జనసేన కార్యక్రమాల్లో బిజీగా ఉండబోతోన్నాడు.

   కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్

  కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్

  ఈ సినిమా తర్వాత పవన్ ... రాజకీయాల కోసం కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. దీంతో ఆ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అభిమానులకు ఒక రోజు ముందే ఆనందాన్ని పంచేందుకు అజ్ఞాతవాసి సిద్ధమవబోతున్నాడట.

  జనవరి 9నే విడుదలయిపోతోంది

  జనవరి 9నే విడుదలయిపోతోంది

  జనవరి 10న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించేసారు. అయితే అభిమానులకు ఆనందం ఇచ్చే విషయం ఏమిటంటే, అజ్ఞాతవాసి జనవరి 9నే విడుదలయిపోతోంది. జనవరి 9న సెకెండ్ షోతో అజ్ఞాతవాసిని విడుదల చేయాలని హారిక హాసిని సంస్థ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

  అనుమతులు ఇవ్వడంలేదు

  అనుమతులు ఇవ్వడంలేదు

  సాధారణంగా భారీ క్రేజ్ వున్న సినిమాలకు స్పెషల్ షోలు అడుగుతారు. భారీ రేట్లకు అమ్ముతారు కూడా. కానీ ఈ మధ్య హైదరాబాద్ లో మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతులు ఇవ్వడంలేదు. దీని కోసం భారీగా కిందామీదా పడాల్సి వస్తోంది. ఈ తలకాయ నొప్పి ఎందుకని ఏకంగా విడుదలనే 9 సెకెండ్ షోకి మార్చేస్తున్నారు.

   ఒక షో అదనంగా

  ఒక షో అదనంగా


  బాహుబలి 2ను ఇలాగే చేసారు. పైగా దీనివల్ల ఓ షో అదనంగా పడుతుంది. దాన్ని జిల్లాల్లో ప్రీమియర్ గా మార్చి అదనపు రేట్లకు అమ్ముతారు. దీనివల్ల ఫస్ట్ డే రికార్డు, ఫస్ట్ వీకెండ్ రికార్డులు వస్తాయి కూడా. 120 కోట్ల రేంజ్ లో థియేటర్ వసూళ్లు సాగించాల్సిన సినిమా అజ్ఞాతవాసి. అందువల్ల ఇలా ముందు విడుదల చేయడం మంచి ప్లానింగ్ నే అనుకోవాలి.

  English summary
  Power Star Pawan Kalyan's forthcoming film Agnathavasi's release date was earlier planned on January 10 as a Sankranthi gift for fans and movie lovers. If the ongoing buzz is to be believed, the film's release may be advanced by a day.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X