twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజ్ఞాతవాసి భారీ దందా.. త్రివిక్రమ్ మొండిపట్టు.. . ‘యూ’ రాకపోవడానికి కారణమదేనట..

    By Rajababu
    |

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న అజ్ఞాతవాసి చిత్రం కమర్షియల్‌గా హిట్ అనేది రిలీజ్‌కు ముందే సినీ వర్గాల్లో ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఏ రేంజ్ హిట్ అనేది రిలీజ్ తర్వాతే తెలుస్తుందని మాట బలంగా వినిపిస్తున్నది. సర్వత్రా పాజిటివ్ టాక్ నెలకొన్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి. అవేమిటంటే..

    Recommended Video

    అజ్ఞాతవాసిపై 'మెగా' రిపోర్ట్ ?
    అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ దందా

    అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ దందా

    అజ్ఞాతవాసి చిత్రం ప్రీ రిలీజ్ దందాను రికార్డు స్థాయిలో చేసింది. ఓవరాల్‌గా పవన్ చిత్రం 150 కోట్లకు పైగానే బిజినెస్ చేసినట్టు సమాచారం. నైజాం మినహాయించి మిగితా ఏరియాల హక్కులు, శాటిలైట్, డిజిటల్ హక్కులన్నీ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోవడంతో టాలీవుడ్ చరిత్రను అజ్ఞాతవాసి తిరుగరాసింది.

    బాహుబలి2 రికార్డు బ్రేక్

    బాహుబలి2 రికార్డు బ్రేక్

    ఇక నైజాం విషయానికి వస్తే అజ్ఞాతవాసి చిత్రం బాహుబలి2 చిత్రాన్ని అధిగమించడం ఓ రికార్డు. ఈ చిత్రానికి సంబంధించిన హక్కులు సుమారు రూ.27 కోట్లకు అమ్ముడుపోయినట్టు ఫిలింనగర్ సమాచారం. ఈ చిత్ర నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే.

    యూట్యూబ్‌లో కొడుకా రఫ్

    యూట్యూబ్‌లో కొడుకా రఫ్

    అజ్ఞాతవాసి చిత్రంలో పాడిన కొడుకా కోటేశ్వరరావు పాట యూట్యూబ్‌లో సంచలనం రేపుతున్నది. సుమారు రెండు రోజుల్లో 5,311,309 వ్యూస్ వచ్చాయి. అలాగే 288,360 మంది లైక్ చేయగా, 18,470 మంది డిస్‌లైక్స్ వచ్చాయి

    ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో

    ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో

    అజ్ఞాతవాసి చిత్రం ఓవర్సీస్‌లో రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. ఇంకా ఎన్ని థియేటర్లనేది లెక్కతేలకపోయినప్పటికీ.. బాహుబలిని మించిన థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశం లేకపోలేదు.

     యూ సర్టిఫికెట్ వస్తుందని..

    యూ సర్టిఫికెట్ వస్తుందని..

    అజ్ఞాతవాసి చిత్రానికి యూ సర్టిఫికెట్ వస్తుంది అని పక్కాగా అందరూ ఊహించారు. కానీ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ రావడం సినీ వర్గాలకు ఆశ్చర్యం కలిగించింది. అయితే అసలు విషయం ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయం బయటపడింది. అదేమిటంటే..

    రెండు ఫైట్స్ విషయంలో

    రెండు ఫైట్స్ విషయంలో

    అజ్ఞాతవాసి చిత్రంలోని రెండు ఫైట్ సీన్ల విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంత మొండిపట్టు పట్టారట. రెండు ఫైట్స్ విషయంలో వెనుకంజ వేయకపోవడంతో యూ సర్టిఫికెట్ రాలేదట.

    రక్తపాతంతో యాక్షన్ సీన్లు

    రక్తపాతంతో యాక్షన్ సీన్లు

    వారణాసిలో పవన్ కల్యాణ్, సాధువుల మధ్యన జరిగే యాక్షన్ సీన్లు చాలా ఉత్కంఠకు లోను చేస్తాయట. అంతేకాకుండా సాధువుల మధ్య జరిగే ఫైట్స్లో రక్తపాతం బీభత్సంగా ఉంటుందట. ఆ ఫైట్ విషయంలో సెన్సార్ బోర్డు అధికారులు అభ్యంతరం చెప్పారట.

    త్రివిక్రమ్ శ్రీనివాస్ మొండిగా

    త్రివిక్రమ్ శ్రీనివాస్ మొండిగా

    ఆ ఫైట్స్ సీక్వెన్స్ కథలో కీలకం కావడంతో కట్స్ విధించడానికి త్రివిక్రమ్ ఒప్పుకోకపోవడంతో యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలిసింది. ఆ ఫైట్ విషయంలో త్రివిక్రమ్ రాజీపడి ఉంటే యూ సర్టిఫికెట్ వచ్చేదనే మాట వినిపిస్తున్నది.

    తొలి వారంలోనే 100 కోట్లు

    తొలి వారంలోనే 100 కోట్లు

    ఇక అజ్ఞాతవాసి తొలివారమే 100 కోట్లలో చేరే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. ఈ చిత్రంతో టాలీవుడ్ 200 కోట్ల సరికొత్త రికార్డును అందుకొంటుందనే మాట వినిపిస్తున్నది.

    జనవరి 10న తెలుగు రాష్ట్రాల్లో

    జనవరి 10న తెలుగు రాష్ట్రాల్లో

    హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పవన్ సరసన అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ చిత్రం ఓవర్సీస్‌లో జనవరి 9న, తెలుగు రాష్ట్రాల్లో 10న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

    English summary
    Power Star Pawan Kalyan’s Agnyaathavaasi has got its censor formalities completed and the movie has been received ‘UA’ certificate from the censor board. The film is directed by Trivikram Srinivas & Produced by S. Radha Krishna(chinababu) under Haarika & Hassine Creations banner. Grand release on 10th January (US Premieres 9th Jan)
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X