twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజ్ఞాతవాసి ట్రైలర్: కుర్చీ కథ కేక, నవరసాలు పండించిన పవర్ స్టార్!

    By Bojja Kumar
    |

    Recommended Video

    పవన్ 'అజ్ఞాతవాసి' ట్రైలర్.. ఇంత భీభత్సంగా ఉందేంటి ?

    ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'అజ్ఞాతవాసి' ట్రైరల్ వచ్చేసింది. అసలు ఎవరూ ఊహించని విధంగా ట్రైలర్ ఉంది. ఈ ట్రైలర్లో కుర్చీ కథ చెప్పి జీవిత సత్యాన్ని వివరించారు పవర్ స్టార్. "ఇది మనం కూర్చునే కుర్చీ... పచ్చటి చెట్టును గొడ్డలితో పడగొట్టి, రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి, బెరడును బ్లేడుతో సానబెట్టి, ఒళ్లంతా మేకులతో కొట్టి కొట్టి తయారు చేస్తారు. ఎంత హింస దాగుందో కదా?...జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకా ఓ మినీ యుద్ధమే దాగుంది" అంటూ పవర్ స్టార్ అదరగొట్టారు.

    మేకింగ్ సూపర్

    ట్రైలర్ చూస్తుంటే సినిమా మేకింగ్ ఎంత బావుందో ఇట్టే అర్థమైతోంది. ఇండియాలోని వారణాసితో పాటు విదేశాల్లో సినిమా చిత్రీకరించారు. ప్రతి ఫ్రేము ఎంతో గ్రాండ్ గా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అనేలా ఉంది.

    నవరసాలు, అదరిపోయే యాక్షన్

    నవరసాలు, అదరిపోయే యాక్షన్

    పవర్ స్టార్‌ను ఈ సినిమాలో గత సినిమాల కంటే భిన్నమైన షేడ్స్ లో చూడబోతున్నాం. ఆయన ఇందులో నవరసాలు పలికించారని తెలుస్తోంది. దీంతో పాటు కార్ జేజింగ్ సీన్లు, సైకిల్ సీన్లు, రొమాంటిక్ సీన్లు... అబ్బో ట్రైలరే ఇలా ఉందంటే సినిమా ఇంకా ఎలా ఉండబోతోందో?

    ప్రతి పాత్ర ఆసక్తికరంగా

    ప్రతి పాత్ర ఆసక్తికరంగా

    సినిమాలో కేవలం పవన్ కళ్యాణ్ రోల్ మాత్రమే కాకుండా ప్రతి పాత్రను త్రివిక్రమ్ ఆసక్తికరంగా తెరకెక్కించారని తెలుస్తోంది. ముఖ్యంగా రావు రమేష్, మురళీ శర్మ మధ్య వచ్చే సీన్లు ఫన్ క్రియేట్ చేస్తున్నాయి. "వీడి చర్యలు ఊహాతీతం వర్మా... దట్స్ బ్యూటీ" అంటూ వీరు చెప్పే డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    భారీ రిలీజ్, అర్ధరాత్రి కూడా షోలు

    భారీ రిలీజ్, అర్ధరాత్రి కూడా షోలు

    అజ్ఞాతవాసి సినిమాకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని అర్దరాత్రి తర్వాత కూడా షోలకు అనుమతి లభించింది. జనవరి 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రోజూ రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం పది గంటల వరకు ప్రత్యేక షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఈ నిర్ణయంతో పవర్ స్టార్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    200 కోట్ల అంచనా

    200 కోట్ల అంచనా

    తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బాగా క్రేజ్ ఉండటం, అర్దరాత్రి షోలకు కూడా అనుమతి ఇవ్వడం, పండగ సీజన్ కావడంతో సినిమా వసూళ్లు రూ. 200 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

     సెన్సార్ పూర్తి

    సెన్సార్ పూర్తి

    ‘అజ్ఞాతవాసి' సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫైట్ సీన్ల విషయంలో కాంప్రైజ్ అయితే ‘యు' ఇస్తామని సెన్సార్ బోర్డు చెప్పినా త్రివిక్రమ్ వినలేదట.

    ఓవర్సీస్‌లో బాహుబలి రికార్డు బద్దలు

    ఓవర్సీస్‌లో బాహుబలి రికార్డు బద్దలు

    ఈ చిత్రం ఓవర్సీస్‌లో అత్యధిక స్క్రీన్లలో ప్రదర్శితం కాబోతోంది. ఈ విషయంలో ‘బాహుబలి' చిత్రాన్ని సైతం వెనక్కి నెట్టేసింది. రేపు విడుదలైన తర్వాత కలెక్షన్లు కూడా అదే స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు.

    హ్యాట్రిక్ మీద కన్నేసిన త్రివిక్రమ్

    హ్యాట్రిక్ మీద కన్నేసిన త్రివిక్రమ్

    పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న 3వ సినిమా ఇది. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా', ‘అత్తారింటికి దారేది' చిత్రాలు భారీ విజయం అందుకున్నాయి. ‘అజ్ఞాతవాసి' సినిమాతో వీరి కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు.

     ‘అజ్ఞాతవాసి' చిత్రం చూడటానికి సిద్ధమైన ఫ్రెంచి డైరెక్టర్

    ‘అజ్ఞాతవాసి' చిత్రం చూడటానికి సిద్ధమైన ఫ్రెంచి డైరెక్టర్

    ఫ్రెంచిలో ‘లార్గో వించ్' చిత్రానికి దర్శకత్వం వహించిన జెరోమ్ సల్లే...... ఇండియన్ మీడియాలో వస్తున్న వార్తలపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. నేను వెంటనే ‘అజ్ఞాతవాసి' టికెట్స్ బుక్ చేసుకుంటున్నానని, ఇండియన్ మీడియాలో వార్తల నేపథ్యంలో తనలోనూ ‘అజ్ఞాతవాసి'పై క్యూరియాసిటీ పెరిగిందని జెరోమ్ సల్లే ట్వీట్ చేశారు. ఈ చిత్రం ఫ్రెంచి సినిమా ‘లార్గో వించ్' కు కాపీ అని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

     ఏం జరుగుతుందో?

    ఏం జరుగుతుందో?

    టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ‘అజ్ఞాతవాసి' సినిమా తాము రీమేక్ రైట్స్ దక్కించుకున్న ‘లార్గో వించ్' చిత్రానికి కాపీ అనే ఆరోపణలు రావడంతో టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ చిత్ర నిర్మాతలతో సంప్రదింపులు జరిపారు. కాపీ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు. పవన్ కళ్యాణ్ హీరో కావడం, టి-సిరీస్ లాంటి బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ కావడంతో జాతీయ మీడియా సైతం ఈ కాపీరైట్ ఇష్యూపై స్పెషల్ పోకస్ పెట్టాయి. విషయం ఫ్రెంచి డైరెక్టర్ వరకు వెళ్లి అతడు కూడా అలర్ట్ అయ్యాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

    English summary
    Watch & Enjoy the official trailer of Agnyaathavaasi featuring Pawan Kalyan, Keerthy Suresh & Anu Emmanuel in lead roles. Directed by Trivikram Srinivas, Music is composed by Anirudh Ravichander.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X