For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పవన్ ప్లాప్ మూవీ: అది క్షమించరానిది, ఇక గుణపాఠం చెబుతామన్న దర్శకుడు, రాజమౌళిపై పొగడ్తలు!

By Bojja Kumar
|

పవన్ కళ్యాణ్ నటించిన ప్లాప్ మూవీ 'అజ్ఞాతవాసి' సినిమాపై కాపీ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్ర కథను ఫ్రెంచి మూవీ 'లార్గో వించ్' నుండి కాపీ కొట్టడంతో ఇది కనిపెట్టిన ఆ చిత్ర దర్శకుడు జెరోమ్ సల్లె లీగల్ నోటీసులు పంపారు. చిత్ర నిర్మాణ సంస్థ 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' వారికి నోటీసులు అంది రెండు వారాలైనా వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ రాక పోవడంతో ఫ్రెంచి ఫిల్మ్ మేకర్ వారిని కోర్టుకు లాగేందుకు సిద్ధమయ్యారు. తాజాగా హైదరాబాద్‌ టైమ్స్‌తో జెరోమ్ సల్లే మాట్లాడుతూ తన తదుపరి కార్యాచరణపై స్పందించారు.

ఇక సినిమాలు యూఎస్ఏ, ఫ్రాన్స్‌లో రిలీజ్ చేయాంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి

హైదరాబాద్‌ టైమ్స్‌తో జెరోమ్ సల్లే మాట్లాడుతూ.....‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారికి మా లాయర్ నోటీసులు పంపారు. ఇది మా తొలి అడుగు. అటు నుండి రెస్పాన్స్ ఇప్పటి వరకు రాలేదు, సమాధానం రాని పక్షంలో మరో అడుగు ముందుకేస్తాం. ‘అజ్ఞాతవాసి చిత్రం కేవలం ఇండియాలోనే విడుదల కాలేదు... యూఎస్, ఫ్రాన్స్‌లో కూడా విడుదల చేశారు. అందుకే అమెరికా, ఫ్రాన్స్‌ కోర్టుల్లో కేసులు వేయాలని నిర్ణయించుకున్నాం. ఇకపై హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ యూఎస్, ఫ్రాన్స్‌లో సినిమాలు రిలీజ్ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా గుణపాఠం చెబుతాం' అని జెరోమ్ సల్లే స్పష్టం చేశారు.

అనిరుధ్‌పై అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌లో డీఎస్పీ ??
అలా నాకు దొరికిపోయారు

అలా నాకు దొరికిపోయారు

నేను తీసిన ‘లార్గేవించ్' చిత్రం కథ ఇండియన్ సినిమాలో వాడుకున్నారనే వార్తలు ట్విట్టర్లో చూశాను. మేము ఈ చిత్ర హక్కులను అప్పటికే టి సిరీస్ సంస్థకు అమ్మడంతో వారే ఈ సినిమా చేస్తున్నారని మొదట భావించాను. కానీ మరో ప్రొడక్షన్ సంస్థ సినిమాలో నా కథ వాడుకున్నారని తెలిసి షాకయ్యాను. సినిమా చూసిన తర్వాత నా సినిమానే కాపీ కొట్టారు అని తేలిపోయింది. అలా నాకు వీరు దొరికిపోయారు అని జెరోమ్ సల్లే తెలిపారు.

ఆ క్రౌడ్ చూసి ఎగ్జైట్ అయ్యాను

పారిస్‌లో ‘అజ్ఞాతవాసి' సినిమా వేసినపుడు చూడటానికి వెళ్లాను. అక్కడ క్రౌడ్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆ థియేటర్లో ఆ సినిమా చూసిన ఫ్రెంచి వ్యక్తిని నేనొక్కడినే. నా సినిమా కథను మా అనుమతి లేకుండా వాడుకోవడం ఆగ్రహం తెప్పించింది... అని జెరోమ్ సల్లె తెలిపారు.

అది క్షమించరానిది

నేను తీసిన ‘లార్గే వించ్' చిత్రం నుండి కేవలం కథ మాత్రమే కాదు, సీన్లు, డైలాగులు, చివరకు సెట్స్ కూడా కాపీ కొట్టారు. చాలా వరకు మక్కీకి మక్కి దించారు. సినిమా చివర్లో వచ్చే టెర్రస్ ఫైట్ కూడా ‘లార్గో వించ్' నుడి కాపీ కొట్టారు. ఇది క్షమించరానిది.... అని జెరోమ్ సల్లే ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారే నా వద్దకు వచ్చేలా చేస్తాను

నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వారి వద్దకు వెళ్లను. వారే నా వద్దకు వచ్చేలా చేస్తాను. నేను పంపిన నోటీసులకు సమాధానం ఇవ్వకండా మౌనంగా ఉండటం స్మార్ట్ అనుకుంటున్నారు.... అని జెరోమ్ సల్లే మండి పడ్డారు.

వారి మధ్య సెటిల్మెంట్ జరిగినట్లు తెలిసింది

ఈ ఇష్యూ గురించి ‘లార్గో వించ్' ప్రొడక్షన్... టి సిరీస్ సంస్థతో డిసెంబర్ నుండి టచ్ లోనే ఉన్నాం. మాకు తెలియకుండా టి సిరీస్ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారికి నోటీసులు పంపారు. ఆ రెండు ఇండియన్ కంపెనీల మధ్య సెటిల్మెంట్ జరిగినట్లు కూడా మాదృష్టికి వచ్చింది. కానీ దీనిపై టీ సిరీస్ వారు కూడా స్పందించలేదు అని.. జోరోమ్ సల్లె తెలిపారు.

మా పోరాటం డబ్బు కోసం కాదు, విలువల కోసం

మేము డబ్బు కోసం ఈ పోరాటం చేయడం లేదు, విలువలకు సంబంధించిన మ్యాటర్ ఇది. మా సినిమాను కాపీ కొట్టినందుకు వారి నుండి స్పష్టమైన వివరణ కోరుతున్నాం. అజ్ఞాతవాసి మేకర్స్ మాతో మాట్లాడాలనుకుంటే ఇప్పటికీ ఇంకా సమయం ఉంది. మా యొక్క ఉద్దేశ్యాన్ని వారు గ్రహిస్తారని కోరుకుంటున్నాం.... అని జోరోమ్ సల్లె తెలపారు.

రాజమౌళి మీద పొగడ్తలు

ఇండియన్ సినిమాలపై మీ అభిప్రాయం ఏమిటి అనే ప్రవ్నకు జోరోమ్ సల్లే స్పందిస్తూ.... ఇండియాలో ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్లు, డైరెక్టర్లు ఉన్నారు. లీనా యాదవ్ నుండి ఎస్ఎస్ రాజమౌళి వరకు చాలా మంది గురించి విన్నాను. ఇక్కడ అమేజింగ్ క్రియేటివిటీ ఉంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల గురించి నేను చాలా విన్నాను.... అని జెరోమ్ సల్లే తెలిపారు.

ఇండియన్ సినిమా మీద గౌరవం ఉంది

నాకు ఇండియన్ సినిమా మీద, ఇక్కడి నటులు, టెక్నీషియన్ల టాలెంటు మీద గౌరవం ఉంది. ఉన్నో అద్భుతమైన సినిమాలు ఇక్కడి నుండి వచ్చాయి. ఎంతో మంది అద్భుతమైన నటులు ఇండియాలో ఉన్నారు... అని జెరోమ్ సల్లె కొనియాడారు.

English summary
"My lawyer sent a legal notice to Haarika Haasine creations and this is the first step. If I don't get a valuable answer from them, we will move forward. Agnyaathavaasi has not just been released in India, but also in France and the US. We'll decide where our action will take place. Haarika Haasine Creations should think twice before they plan to release their upcoming movies in France and the US also," said Jereome to Hyderabad Times.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more