అంతా సీక్రెట్: ఆహుతి ప్రసాద్ ఆరోగ్యంపై సమాచారం లేదు

By Bojja Kumar

హైదరాబాద్: ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ అనారోగ్యం కారణంగా ఇటీవల సికింద్రాబాద్ కిమ్స్ లో చేరినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆయనకు ఏమైంది? అసలు ఆయనకున్న ఆరోగ్య సమస్య ఏమిటి? అనే విషయాలు బయటకు తెలియడం లేదు. ఈ విషయంలో ఆయన కుటుంబ సభ్యులు ఎవరితోనూ మాట్లాడటం లేదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆహుతి ప్రసాద్ సన్నిహితులు, ఫ్రెండ్స్ ఆయన అనారోగ్యం వార్తలు విని ఆయనతో మాట్లాడటానికి, కలవడానికి ప్రయత్నించినా ఆయన అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. కొందరు ఆయన్ను కలవడానికి ఇంటికి వెళ్లినా కుటుంబ సభ్యులు ఆయన ఇంట్లో లేరని చెబుతున్నారని, ఫోన్ చేసినా ఆయన బిజీగా ఉన్నారు, మాట్లాడటం కుదరదు అని సమాధానం ఇస్తున్నారని తెలుస్తోంది. ఆయన కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారని, చికిత్స తీసుకుంటున్న తెలుస్తోందని కొన్ని ఆంగ్ల పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి.

Ahuti Prasad health problem a secret

క్రిష్ణా జిల్లా ముదినెపల్లి పక్కనున్న కోడూరు గ్రామానికి చెందిన ఆహుతి ప్రసాద్ తెలుగులో చిన్న చిన్న పాత్రలతో మొదలు పెట్టి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగారు. విలనిజం పండించడంలోనూ, హాస్యం పండించడంలోనూ ఆయనది అందెవేసిన చేయి. చందమామ సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు కూడా అందుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X