»   » భారతీయులు గర్వపడేలా ఉంటుందన్న అక్షయ్ కుమార్

భారతీయులు గర్వపడేలా ఉంటుందన్న అక్షయ్ కుమార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బాలీవుడ్ మూవీ ఎయిర్ లిఫ్ట్. 1990లో జరిగిన ఇరాక్-కువైట్ యుద్ద నేప‌థ్యంలో అక్క‌డ ఉన్న భార‌తీయుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లించ‌డం అనే అంశంపై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రియల్ స్టోరీ అధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి రాజా కృష్ణ మీన‌న్ ద‌ర్శ‌కుడు.

జ‌న‌వరి 22వ తేదిన ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ మూవీ విడుద‌ల కానుంది. సినిమా గురించి అక్షయ్ కుమార్ ట్వీట్ చేస్తూ భారతీయులు గర్వపడేలా ఉంటుందన్నారు. అక్షయ్ కుమార్ సరసన నిమ్రతా కౌర్ నటిస్తోంది. ఇందులో అక్షయ్ కువైట్ బిజినెస్‌మేన్‌గా కనిపించనున్నాడు. అంతేకాదు, ఈ సినిమాలో సద్దాం పాత్ర కూడా ఉంటుందట.

ఓవ‌ర్ సీస్ లో మొత్తం 500 వంద‌ల థియేట‌ర్ల‌లో ఈ మూవీ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఆ చిత్ర యూనిట్ పేర్కొంది. కువైట్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే క్రమంలో ఎదురైన పరిస్థితులను దర్శకుడు రాజ్‌ మీనన్‌ చాలా అద్భుతంగా తెరకెక్కించారని అక్షయ్‌ అన్నారు.

English summary
"AirliftFilm, a true story that will make you #ProudToBeIndian! #Jan22" Akshay Kumar tweeted.
Please Wait while comments are loading...