ఆ రీమేక్‌లో అభిషేక్, ఐశ్వర్య ఖరారు

By Srikanya

ముంబై : నిజ జీవిత భార్యా భర్తలు అయిన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య కలిసి ఓ చిత్రంలో నటించే అవకాశాలునున్నట్లు బాలీవుడ్ సమాచారం. అదీ ఓ రీమేక్ అని తెలుస్తోంది. వివాహం జరిగిన చాలాకాలం తర్వాత ఈ జంట ఓ రీమేక్ చిత్రంలో నటించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. గతంలో శేఖర్ కపూర్ నిర్మించిన 'మసూమ్'ను అభి, ఐశ్వర్యలతో తిరిగి నిర్మించాలని హిమేష్ రేషమ్మియా అనే నిర్మాత ప్రయత్నిస్తున్నట్లు, జాతీయ అవార్డు గ్రహీత బేదబ్రతను ఇప్పటికే సంప్రదించినట్లు సమాచారం.

అలనాటి 'మసూమ్'లో నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ పోషించిన పాత్రలకు అభిషేక్, ఐశ్వర్యలను ఎంపిక చేసి, రీమేక్ హక్కుల కోసం నిర్మాత ప్రయత్నాలు మొదలుపెట్టారట. ప్రముఖ రచయిత గుల్జార్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, పాటలు సమకూర్చనున్నట్లు, అమితాబ్ కుటుంబం నుంచి 'గ్రీన్ సిగ్నల్' లభించిన వెంటనే షూటింగ్ ప్రారంభమవుతుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరో ప్రక్క అందాన్ని రాశిపోసినట్లుండే ఐశ్వర్యారాయ్‌ కొన్ని రోజుల క్రితం దక్షిణాదికి చెందిన ప్రముఖ నగల సంస్థ వాణిజ్య ప్రకటనలో భాగంగా ఆమె ధరించిన దుస్తులు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ నగల సంస్థ ప్రచారంలో ఈమె కూడా భాగం కావడం చెప్పుకోదగ్గ విషయం. ఇదే సంస్థకు 'బిగ్‌ బి' అమితాబ్‌ బచ్చన్‌ కూడా ప్రచార కర్తగా వ్యవహరిస్తుండటం గమనార్హం.

మామ-కోడలు ఒకే నగల సంస్థకు ప్రచారం చేయడం బహుశా ఇదే ప్రథమం కావచ్చు. ఆ సంస్థవారు తాము తయారు చేసే గాజులకు విస్తృతంగా ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో ఐశ్యర్యాతో ఒక ఫొటో షూట్‌ నిర్వహించారు. దీనిలో పూర్వపు నాజుకైన శరీర సౌష్టవంతో ఈమె ధరించిన మెర్‌మెడ్‌ గౌన్‌ను మొత్తం బంగారు వర్ణం గాజులతో తయారుచేశారు. ఐశ్వర్య వస్త్రధారణపై ఒక కన్నువేసి ఉంచే డిజైనర్లకు ఇది ఎంత నచ్చిందంటే ఇలాంటి దాన్ని ఇంతకు ముందెన్నడూ చూడలేదని వారు చాలా ఆశ్చర్యపోయారు.

మెరుపుతీగవలే ఉండే ఐశ్వర్య మాతృత్వం తరువాత బరువు పెరగడంతో పలు విమర్శలు ఎదుర్కొంది. అన్నింటిని ఎంతో హుందాగా స్వీకరించిన ఈ ప్రపంచ సుందరి ప్రస్తుతం ఎంతో నాజూకుగా తయారై అందరికి దీటుగా సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఏ చిత్రంలోనూ నటించకపోయినా పలు సంస్థలకు ప్రచార కర్తగా కనిపిస్తూ అభిమానులను అలరిస్తూనే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X