»   » ఐశ్వర్య రాయ్‌ పెదాలు ఎందుకు వాచాయంటే...

ఐశ్వర్య రాయ్‌ పెదాలు ఎందుకు వాచాయంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఐష్ కి ఈ మధ్య పెదాలు వాచిపోవటంతో ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం 'యాక్షన్‌ రీప్లే' షూటింగ్ కు ఇబ్బంది ఏర్పడింది. దాంతో ఈ విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమె పెదాలు వాయటానికి కారణం జనాలు ఊహిస్తున్నట్లుగా వేరే ఏమీ కాదు. కేవలం డ్రగ్ రియాక్షన్ మాత్రమేనని నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల మనోరీ ఐస్‌ లాండ్‌ లో సాగింది. అక్కడ ఐష్‌కి జ్వరం, గొంతునొప్పి వచ్చాయి. వెంటనే తగ్గడానికి యాంటీ బయాటిక్స్‌ ఎక్కువగా వాడింది. దీంతో రియాక్షన్‌ వచ్చి ఆమె పెదాలు బాగా వాచిపోయాయి. ఒకదశలో చిత్రీకరణ ఆపేద్దామనుకున్నారు. కానీ ఆమె కాల్షీట్లు తరవాత ఖాళీగా లేకపోవడంతో పెదాల మీదకు దుపట్టా అంచు వచ్చేలా కవర్‌ చేసి చిత్రీకరణ కొనసాగించారు. అక్షయ్‌ కుమార్‌ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని విపుల్‌ షా రూపొందిస్తున్నారు.విపుల్ షా ఇంతకు ముందు అక్షయ్ తో నమస్తే లండన్, సింగ్ ఈజ్ కింగ్ చిత్రాలు రూపొందించిన సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu