సల్మాన్ అయితే ఏంటీ... అక్కడే తేల్చుకొంటా.. మాజీ ప్రియుడికి ఐష్ సవాల్
Recommended Video

అభిషేక్ బచ్చన్‌తో పెళ్లి, ఆరాధ్య పుట్టిన తర్వాత అందాలతార ఐశ్వర్యరాయ్ సినిమాల వేగం పెంచేసింది. ప్రస్తుతం ఫన్నే ఖాన్ అనే చిత్రంలో నటిస్తున్నది. రిలీజ్ అంతా సవ్యంగా జరుగుతుందని అనుకొంటున్న తరుణంలో ఐష్‌కు పెద్ద షాక్ తగిలింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

షాకిచ్చిన సల్మాన్ ఖాన్
ఐశ్వర్యకు షాక్ తగిలింది మరెవరి నుంచో కాదు ఏకంగా తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ నుంచే. సల్మాన్ ఖాన్ చిత్రం రేస్ 3 చిత్రంతో ఐశ్వర్యరాయ్ ఢీకొనాల్సి రావడం కొంత ఇబ్బంది పెట్టే సమస్యే. అయితే సల్మాన్ బెదరకుండా ఏకంగా మాజీ లవర్‌ను ఎదుర్కోవడానికి ఐశ్వర్య సిద్ధమైందట.

ఐశ్వర్య రిలీజ్ డేట్ ప్రకటన
ఫన్నేఖాన్ రిలీజ్ డేట్‌పై నిర్మాత ప్రేరణ అరోరా స్పందించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య ప్రధాన నటి. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ కావాలో ఆమెకు తెలుసు. ఐశ్వర్య సమ్మతితోనే రిలీజ్ డేట్ ప్రకటించాం అని ఆమె చెప్పారు.

సల్మాన్ వర్సెస్ ఐశ్వర్య
ఐశ్వర్య వర్సెస్ సల్మాన్ అంశం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. సల్మాన్ ఖాన్‌ను ఢీకొనడం సరికాదు అనే వాదనను కొందరు వినిపిస్తుండగా, ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. దాంతోనే బాక్సాఫీస్ ఫలితం నిర్ధారణ అవుతుంది అని మరికొందరు అంటున్నారు.

క్రిస్మస్ పార్టీలో ఐశ్వర్య
చిత్ర షూటింగుల, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉంటూనే ఐశ్వర్య పార్టీలో మునిగి తేలుతున్నది. ఇటీవల అభిషేక్, రణ్‌బీర్ కపూర్‌తో కలిసి క్రిస్మస్ పార్టీలో ఎంజాయ్ చేసింది. సోషల్ మీడియాలో ఈ ఫొటోకు మంచి స్పందన వచ్చింది.

మాజీ ప్రేయసితో సల్మాన్
ఐష్‌కు ఏ మాత్రం తగ్గకుండా టైగర్ జిందా హై ప్రమోషన్‌లో బిజీగా గడుపుతూ తన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్‌తో క్రిస్మస్ వేడుకలను జరుపుకొంటున్నారు. శాంటాక్లాజ్ టోపితో సెల్ఫలు దిగుతూ కత్రినాతో సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

దుమ్మురేపుతున్న టైగర్
సల్మాన్, కత్రినా కైఫ్ నటించిన టైగర్ జిందా హై చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నది. ఈ చిత్రానికి అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నది. టైగర్ జిందా హై చిత్రంపై క్రిటిక్స్ కూడా ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం.


Click it and Unblock the Notifications











