»   » ఐష్, మహేష్, నాగార్జున మూవీలో శృతి హాసన్‌కు ఛాన్స్!

ఐష్, మహేష్, నాగార్జున మూవీలో శృతి హాసన్‌కు ఛాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్వరలో వెండి తెరపై ఓ ఆసక్తికరమైన కాంబినేషన్ చూడబోతున్నాం. అందాల సుందరి ఐశ్వర్యరాయ్, టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, నాగార్జున కలిసి నటించబోతున్నారు. ఈ భారీ కాంబినేషన్ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ కూడా ఎంపికయినట్లు సమాచారం.

బిడ్డపుట్టిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఐశ్వర్యరాయ్ తొలిసారిగా మణిరత్నం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓ వైపు ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ సినిమా....మరో వైపు మహేష్ బాబు, నాగార్జున లాంటి టాప్ స్టార్లు నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ ప్రాజెక్టు హాట్ టాపిక్‌గా మారింది.

Aishwarya Rai Bachchan joins Nagarjuna and Mahesh Babu

గతంలో నాగార్జున మణిరత్నం దర్శకత్వంలో 'గీతాంజలి' లాంటి సూపర్ హిట్ చిత్రంలో నటించారు. ఐశ్వర్యరాయ్ కూడా మణి దర్శకత్వంలో అనేక చిత్రాలు చేసారు. అయితే మహేష్ బాబు మాత్రం మణిరత్నం దర్శకత్వంలో చేస్తుండటం ఇదే మొదటి సారి. తెలుగు, తమిళంలో ఈచిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈచిత్రం ఇంకా కథా చర్చల దశలోనే ఉంది. ఈ సంవత్సరాంతం...అంటే సెప్టెంబర్-అక్టోబర్ నెలలో ఈచిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. నాగార్జున ఈ విషయమై స్పందిస్తూ....మణిరత్నం సినిమాలో మేం చేస్తున్న మాట వాస్తవమే. కానీ ఐశ్వర్యరాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? లేదా? అనేది నాకు తెలియదు. ఇటీవల మణిరత్నం నుండి మా ఫాదర్‌కి సంతాపం తెలుపుతూ మాత్రమే మెసేజ్ వచ్చింది. ఐశ్వర్యరాయ్ విషయం ఆయన నాకు చెప్పలేదు అని తెలిపారు.

English summary
Shruti Hassan's dream to work with Mani Ratnam seems to be finally coming true. Apart from Shruti Hassan and Mahesh Babu, Mani Ratnam is also in talks with Telugu star Nagarjuna and Bollywood actress Aishwarya Rai Bachchan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu