»   » హాస్పటల్ లో ఐశ్వర్యారాయ్ తండ్రి, మరో ప్రక్క విడిపోయి ఉంటున్నారనే వ్యాఖ్యల కలకలం

హాస్పటల్ లో ఐశ్వర్యారాయ్ తండ్రి, మరో ప్రక్క విడిపోయి ఉంటున్నారనే వ్యాఖ్యల కలకలం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: బాలీవుడ్‌ నటి ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ తండ్రి కృష్ణరాజ్‌ రాయ్‌ హాస్పటిల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రెండు వారాల నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అందుకే ఐష్‌ కుటుంబంతో కలిసి దుబాయ్‌ పర్యటనకు వెళ్లి త్వరగా ముంబయి తిరిగొచ్చేసింది. ఐష్‌ ఇటు ముంబయికి రాగానే అభిషేక్‌ పని నిమిత్తం న్యూయార్క్‌ వెళ్లి కొద్ది రోజుల్లోనే తిరిగొచ్చేశాడు.

అభిషేక్ బచ్చన్.. న్యూయార్క్‌లో ఉన్నన్ని రోజులూ ఐష్‌ ఒక్కత్తే తండ్రితో పాటు ఉండి ఆయన ఆలనాపాలనా చూసుకుందట. ఇటీవల ఐష్‌.. తన కుమార్తె ఆరాధ్య చదువుతున్న పాఠశాలలో స్పోర్ట్స్‌డే వేడుకల్లో పాల్గొంది. అప్పుడు కూడా ఐష్‌ తన తండ్రి ఆరోగ్యం గురించి అనుక్షణం తెలుసుకుంటూనే ఉంది. ప్రస్తుతం ఐష్‌, అభి ఇద్దరూ ఆస్పత్రిలోనే ఎక్కువగా ఉంటూ కృష్ణరాజ్‌ని చూసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం ..బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, భార్య జయా బచ్చన్‌ విడివిడిగా జీవిస్తున్నారని రాజకీయ నాయకుడు, బిగ్‌బి ఒకప్పటి స్నేహితుడు అయిన అమర్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

Aishwarya Rai Bachchan's father hospitalised

కొద్ది సంవత్సరాల క్రితం అమితాబ్‌ దంపతులకు, అమర్‌సింగ్‌కు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. జయను సమాజ్‌వాది పార్టీలో చేర్చుకోవద్దని అమితాబ్‌ తనకి వార్నింగ్‌ ఇచ్చారని గతంలో ఒకసారి అమర్‌ సింగ్‌ చెప్పారు. దానికి అమితాబ్‌ స్పందిస్తూ.. అమర్‌ తన స్నేహితుడని, అతడి అభిప్రాయం చెప్పే హక్కు అతనికి ఉందని అన్నారు. కానీ అమర్‌ సింగ్‌ తాజా వ్యాఖ్యలు మాత్రం అమితాబ్‌ అలా కొట్టిపడేసేలా లేవు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమర్‌ మాట్లాడుతూ అమితాబ్‌, జయ విడిగా ఉంటున్నారని చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చారు. అంతేకాదు జయకి, ఆమె కోడలు ఐశ్వర్యరాయ్‌కి మధ్య విభేదాలు ఉన్నట్లు వూహాగానాలు ఉన్నాయన్నారు.

'ప్రజలు దేశంలో ఏ సమస్య ఏర్పడ్డా దానికి నేనే కారణమంటారు. అంబానీ సోదరులు విడిపోయినా.. వారి మధ్య సమస్య తెచ్చిపెట్టింది నేనే అన్నారు. కానీ దానికి కారణం నేను కాదు. బచ్చన్స్‌ విషయంలోనూ అదే అంటున్నారు. కానీ నేను అమితాబ్‌ బచ్చన్‌ను కలవక ముందే ఆయన, జయ బచ్చన్‌ విడిగా జీవిస్తున్నారు. ఒకరు 'ప్రతీక్ష'లో మరొకరు 'జనక్‌'లో. ఐశ్వర్యరాయ్‌, జయ మధ్య కూడా సమస్యలు ఉన్నట్లు వూహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వీటికి నేను బాధ్యుడ్ని కాను' అన్నారు.

English summary
Krishnaraj Rai, father of Aishwarya Rai Bachchan has been in the hospital for the past two weeks.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu