ఐశ్వర్య తండ్రి పరిస్థితి విషమం.. న్యూయార్క్ నుంచి అభిషేక్..
బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తండ్రి కృష్ణరాజ్ రాయ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను ఐసీయూకు తరలించినట్టు తెలిసింది.
బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తండ్రి కృష్ణరాజ్ రాయ్ తీవ్ర అనారోగ్యంతో రెండువారాల క్రితం హాస్పిటల్ చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను ఐసీయూకు తరలించినట్టు తెలిసింది. కృష్ణరాజ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

ముంబైలోని లీలావతి హాస్పిటల్ చికిత్స పొందుతున్న కృష్ణరాజ్‌ను బుధవారం రాత్రి ఐశ్యర్యరాయ్, అభిషేక్ బచ్చన్ పరామర్శించారు. తన మామ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారనే సమాచారంతో న్యూయార్క్ నుంచి హుటాహుటిన అభిషేక్ ముంబైకి చేరుకొన్నారు.

కాగా ఒకవైపు తన కూతురు ఆరాధ్యను ఒకవైపు చూసుకొంటూనే తండ్రి ఆరోగ్యంపై ఐశ్వర్య దృష్టిపెట్టింది. నిరంతరం వైద్యులను సంప్రదిస్తూ తన తండ్రి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.
aishwarya rai bachchan icu abhishek bachchan cancer mumbai ఐశ్వర్యరాయ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ క్యాన్సర్ ముంబై లీలావతి హాస్పిటల్


Click it and Unblock the Notifications