»   » ఐశ్వర్యరాయ్ తండ్రి కృష్ణరాజ్ రాయ్ కన్నుమూత

ఐశ్వర్యరాయ్ తండ్రి కృష్ణరాజ్ రాయ్ కన్నుమూత

Written By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ తండ్రి కృష్ణరాజ్ రాయ్ ఇకలేరు. కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు.

Aishwarya Rai
శనివారం సాయంత్రం కృష్ణరాజ్ కన్నుమూత

శనివారం సాయంత్రం కృష్ణరాజ్ కన్నుమూత

శనివారం సాయంత్రం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కృష్ణరాజ్ రాయ్ తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఐశ్వర్యరాయ్ కన్నీరుమున్నీరైనట్టు సమాచారం. తండ్రి పరిస్థితి విషమంగా ఉన్న కారణంగా ఆమె హోళీ వేడుకలకు దూరంగా ఉన్నారు.

రెండునెలలుగా హాస్పిటల్‌లో

రెండునెలలుగా హాస్పిటల్‌లో

గత జనవరిలో అస్వస్థతకు గురికావడంతో ఆయనను లీలావతి హాస్పిటల్ చేర్పించి చికిత్సనందిస్తున్నారు. కృష్ణరాజ్ రాయ్‌కి భార్య విందా, కుమారుడు ఆదిత్య, కూతురు ఐశ్వర్యరాయ్ ఉన్నారు.

న్యూయార్క్ నుంచి అభిషేక్ బచ్చన్

న్యూయార్క్ నుంచి అభిషేక్ బచ్చన్

తన మామ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారనే సమాచారంతో ఇటీవల అభిషేక్ బచ్చన్ న్యూయార్క్ నుంచి హుటాహుటిన అభిషేక్ ముంబైకి చేరుకొన్న సంగతి తెలిసిందే.

పలువురు సినీ ప్రముఖుల సంతాపం

పలువురు సినీ ప్రముఖుల సంతాపం

తండ్రి మరణంతో బాధపడుతున్న ఐశ్వర్యరాయ్‌కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

English summary
Aishwarya Rai Bachchan’s father, Krishnaraj Rai died in Mumbai’s Leelavati Hospital, He has been in the hospital for the last two weeks
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu