»   »  ఐశ్వర్యరాయ్ ‘జజ్బా’ ఫైట్ సీన్ షూటింగ్... (వీడియో)

ఐశ్వర్యరాయ్ ‘జజ్బా’ ఫైట్ సీన్ షూటింగ్... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఐశ్వర్యరాయ్ త్వరలో ‘జజ్బా' సినిమా ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమె సంజయ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె న్యాయవాది పాత్రలో కనిపించబోతోంది. ఇందులో ఐశ్వర్యరాయ్ పలు యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించింది.

ఐశ్వర్యరాయ్ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్న షూటింగుకు సంబంధించిన వీడియో ఒకటి లీకైంది. ఐశ్వర్యరాయ్ ఎంతో చురుకుగా ఈ షూటింగులో పాల్గొనడం ఇక్కడ గమనించవచ్చు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇందులో ఆమె సింగిల్ మదర్, క్రిమిల్ లాయర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా పెర్ఫార్మెన్స్ పరంగా ఐశ్వర్యరాయ్ కి మంచి పేరు తెచ్చి పెడుతుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

Aishwarya Rai Bachchan's Fight Scene From 'Jazbaa'

ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది. ఐశ్వర్యరాయ్ తో పాటు ఇర్ఫాన్ ఖాన్, షబానా అజ్మి, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్సెల్ విజన్ ప్రొడక్షన్స్ ప్రై.లి. వైట్ ఫాదర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 15 నాటికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Few days back, we had shown you the first stills of much awaited Aishwarya Rai Bachchan's upcoming film, Jazbaa and now we are presenting to you, an exclusive video of Aishwarya Rai Bachchan's fight scene from the film.
Please Wait while comments are loading...