»   » అంతా సీక్రెట్: నిర్మాతగా మారిన ఐశ్వర్యరాయ్

అంతా సీక్రెట్: నిర్మాతగా మారిన ఐశ్వర్యరాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ అందాల సుందరి ఐశ్వర్యరాయ్ ఇప్పటి వరకు మోడల్, ప్రపంచ సుందరిగా, సినీ నటిగా మాత్రమే మనకు తెలుసు. తాజాగా ఆమె సినీ నిర్మాణగా కూడా మారారు. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ ‘జజ్బా' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణంలో ఐశ్వర్యరాయ్ కూడా ఓ భాగస్వామి అని తెలుస్తోంది. కథ నచ్చడం వల్లే ఆమె నిర్మాతగా ఉండేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.

అయితే ఇన్నాళ్లూ ఈ విషయం బయట పడకుండా సీక్రెట్ గా ఉంచారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఐశ్వర్యరాయ్ మళ్లీ సినిమాల్లో నటిస్తున్న చిత్రం ఇది. ఓ మహిళా న్యాయవాదికి ఎదురయ్యే సమస్యల నేపథ్యంలో దర్శకుడు సంజయ్‌గుప్తా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. న్యాయం కోసం పోరాటం చేసే మహిళా లాయర్‌గా ఐశ్వర్యరాయ్ శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది.

Aishwarya Rai Bachchan turns producer with Jazbaa

ఐశ్వర్యరాయ్ తో పాటు ఇర్ఫాన్‌ఖాన్, షబానా ఆజ్మీ తదిరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఐశ్వర్యరాయ్ ఒకప్పటి ప్రపంచ సుందరి. కానీ అమ్మడి వయసు 40 సంవత్సరాలు దాటినా ఇంకా అందాల సుందరిగానే గుర్తింపు పొందుతోంది. నాలుగు పదుల వయసులోనూ వన్నె తరగని అందం ఆమె సొంతం.

ఇందులో ఆమె సింగిల్ మదర్, క్రిమిల్ లాయర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా పెర్ఫార్మెన్స్ పరంగా ఐశ్వర్యరాయ్ కి మంచి పేరు తెచ్చి పెడుతుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇందులో ఆమె పలు యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించింది. విభిన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

English summary
Bollywood source said that Aishwarya Rai Bachchan turns producer with Jazbaa.
Please Wait while comments are loading...