»   » అందంతోనే కాదు.. ఇక పాటతోనూ ఐశ్వర్యరాయ్ మాయ.. 17 ఏళ్ల తర్వాత..

అందంతోనే కాదు.. ఇక పాటతోనూ ఐశ్వర్యరాయ్ మాయ.. 17 ఏళ్ల తర్వాత..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందంతో సినీ అభిమానులను ఆకట్టుకొన్న ఐశ్వర్యరాయ్ ఇక తన గళంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆద్యకు జన్మనిచ్చిన తర్వాత ఏ దిల్ హై ముష్కిల్ చిత్రంలో హాట్ హాట్‌గా నటించిన ఈ అందాల తార దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా రూపొందించే ఫన్నే ఖాన్ అనే చిత్రంలో నటించడంతోపాటు గాయనిగా మారుతున్నట్టు ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఇంకా ఈ చిత్రానికి సంబంధించి చాలా విశేషాలు వినిపిస్తున్నాయి.

17 ఏళ్ల తర్వాత అనిల్‌తో ఐశ్వర్య

17 ఏళ్ల తర్వాత అనిల్‌తో ఐశ్వర్య

ఫన్నేఖాన్ చిత్రంలో సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా నటిస్తున్నాడు. 17 ఏళ్ల తర్వాత ఐశ్వర్యరాయ్, అనిల్ కలిసి నటించడం గమనార్హం. గతంలో సుభాష్ ఘయ్ రూపొందించిన తాళ్ చిత్రంలో వీరిద్దరూ జోడిగా నటించారు. అయితే ఈ చిత్రంలో వారిద్దరూ జోడిగా నటించడం లేదనిది తాజా సమాచారం.

ఐశ్వర్యతో క్రేజ్ పెరిగింది.

ఐశ్వర్యతో క్రేజ్ పెరిగింది.

ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా వివరిస్తూ.. ఐశ్వర్యరాయ్ నటిస్తున్నారనే వార్తతో ఫన్నేఖాన్ చిత్రానికి మరింత క్రేజ్ పెరిగింది. ఈ సినిమాలో ఐశ్వర్య కొత్తగా కనిపిస్తుంది. అనిల్‌తో పోటాపోటీగా నటిస్తుంది. జజ్బా, సరబ్‌జిత్ చిత్రాల్లో సీరియస్ పాత్రల్లో కనిపించిన ఐశ్వర్య అందుకు భిన్నంగా కనిపిస్తుంది అని తెలిపారు.

ఫన్నేఖాన్ చిత్రం

ఫన్నేఖాన్ చిత్రం

2000 సంవత్సరంలో విడుదలైన డచ్ చిత్రం ఎవ్రీబడీస్ ఫేమస్ అనే చిత్రం ఆధారంగా ఫన్నేఖాన్ సినిమా రూపొందుతున్నది. భారతీయ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఈ సినిమా కథను మార్పులు చేసినట్టు తెలుస్తున్నది. ఈ సినిమాను విభిన్నమైన చిత్రంగా రూపొందించేందుకు దర్శక, నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

ఆగస్టులో షూటింగ్ ప్రారంభం..

ఆగస్టులో షూటింగ్ ప్రారంభం..

ఫన్నేఖాన్ చిత్రం వచ్చే ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లనున్నది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా సెట్ వేస్తున్నారు. ఆగస్టు మొదటివారంలో షూటింగ్ ప్రారంభిస్తారు. ఐశ్వర్యరాయ్ ఆగస్టు చివరి వారంలో చిత్ర యూనిట్‌తో జత కలుస్తుంది అక్టోబర్ కల్లా షూటింగ్‌ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు అని నిర్మాత వెల్లడించారు.

English summary
Salman Khan, Shraddha Kapoor and Alia Bhatt, Aishwarya Rai Bachchan seems to be the latest Bollywood actor to have been bitten by the singing bug. After making heads turn with her sensuous performance in Karan Johar's Ae Dil Hai Mushkil, the 43-year-old actor will return to the big screen with Rakeysh Omprakash Mehra's Fanney Khan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu