»   » అంతా షాక్: ఐశ్వర్యరాయ్‌కి ముద్దు పెట్టిన జర్నలిస్ట్ (వీడియో)

అంతా షాక్: ఐశ్వర్యరాయ్‌కి ముద్దు పెట్టిన జర్నలిస్ట్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ అందాల తార, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌కి ఓ జర్నలిస్టు ముద్దు పెట్టిన సంఘటన సంచలనం సృష్టించింది. ఐశ్వర్యరాయ్ షేక్ హ్యాండ్ ఇవ్వడనికి చేయి చాచడంతో ఇదే అవకాశంగా భావించిన జర్నలిస్టు ఆమెను ఏకంగా ముద్దు పెట్టుకున్నాడు. అయితే ఈ హాఠాత్పరిణామంతో ఐష్.... ఏ మాత్రం డిస్టర్బ్ కాకుండా, సంయమనంతో వ్యవరించింది.

Aishwarya Rai gets KISSED by a journalist!

భారత పర్యటనలో భాగంగా ముంబైలో ఓ చారిటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు బ్రిటన్‌ రాజకుమారుడు విలియం, ఆయన భార్య కేట్‌ మిడిల్‌టన్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ ప్రదర్శనకు పలువురు ప్రముఖులతో పాటు అందాల సుందరి ఐశ్వర్యారాయ్‌ కూడా హాజరైంది...ఈ సందర్భంగా ఈ ముద్దు సంఘటన చోటు చేసుకుంది.

ఐశ్వర్యరాయ్ సినిమాల విషయానికొస్తే...
పాకిస్థాన్ జైల్లో ఇరవైమూడు సంవత్సరాల పాటు బందీగా వుండి హత్యకు గురైన భారతీయ ఖైదీ సరబ్జీత్‌సింగ్ నిజ జీవితకథతో దర్శకుడు ఓమంగ్‌కుమార్ (మేరీకోమ్ ఫేమ్) 'సరబ్జీత్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సరబ్జీత్‌సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా నటిస్తున్నాడు. ఆమె సోదరి దల్బీర్‌కౌర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ మెయిన్ రోల్ చేస్తోంది.

1990 సంవత్సరంలో మద్యం మత్తులో పాకిస్థాన్ భూభాగంలోకి ప్రశేశించిన సరబ్జీత్‌సింగ్ ను భారతీయ గూఢచారిగా అనుమానించిన పాక్‌సైన్యం జైల్లో నిర్భందించింది. లాహోర్ జైల్లో 23 సంవత్సరాల పాటు వున్న సరబ్జిత్‌ను భారత పార్లమెంట్‌పై దాడిచేసిన అఫ్జల్‌గురు మరణశిక్షకు ప్రతీకారంగా సహచర ఖైదీలు మూడేళ్ల క్రితం జైల్లోనే హత్య చేశారు. సరబ్జీత్‌సింగ్ జైల్లో ఉండగా కలిసి వచ్చిన ఆయన సోదరి దల్బీర్‌కౌర్ అక్కడ జైల్లో తన సోదరుడు పడ్డ నరకయాతనను స్వయంగా చూసింది. ఆమె అనుభవాలే కథాంశంగా సినిమా రాబోతోంది.

English summary
Bollywood's light eyed beauty Aishwarya Rai Bachchan who is internationally famous was greeted by a journalist in a warm way at the Gala Dinner held at Taj Hotel Palace in honour of Prince Willam and Kate Middleton's India Visit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu