»   » ఐశ్వర్య హగ్: మనసు ఆగిపోయిందన్న అమితాబ్

ఐశ్వర్య హగ్: మనసు ఆగిపోయిందన్న అమితాబ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ధనుష్, అక్షర హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘షమితాబ్' చిత్రం ప్రీమియర్ షో గురువారం రాత్రి ముంబైలో నిర్వహించారు. ఈ షోకు అమితాబ్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. సినిమా చూసిన అనంతరం ఆయన కోడలు ఐశ్వర్యరాయ్ అమితాబ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించడంతో పాటు హగ్ చేసుకుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Aishwarya Rai hugged Amitabh Bachchan after watching 'Shamitabh'

దీనిపై అమితాబ్ తన బ్లాగులో స్పందిస్తూ...ఐశ్వర్య ప్రశంస దగ్గరే నా మనసు ఆగి పోయింది అంటూ వ్యాఖ్యానించారు. కొన్ని ఫోటోలు కూడా పోస్టు చేసారు. సినిమా ఈ రోజు గ్రాండ్ గా విడుదలైంది. అమితాబ్ అభిమానులను మెప్పించే విధంగా సినిమా ఉందని అంటున్నారు.

Aishwarya Rai hugged Amitabh Bachchan after watching 'Shamitabh'

ఈ చిత్ర టీజర్ విడుదలైనప్పటి నుండే సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం కోసం బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరోసారి తన గళాన్ని విప్పారు. ఓ గీతాన్ని ఆలపించారు. ఆర్. బాల్కీ దర్శకత్వం వహించినఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. ఇంతకుముందు అమితాబ్ నటించిన చీనీ కమ్, పా చిత్రాలకు కూడా బాల్కియే దర్శకుడు. సినిమా విభిన్నంగా సాగుతుంది. తొలి చిత్రం ‘రంఝానా'తో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుష్....రెండో చిత్రంతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

English summary
Aishwarya Rai Bachchan hugged father-in-law Amitabh Bachchan after watching ‘Shamitabh‘ here. Amitabh, 72, who shared pictures on the blog from last night’s screening of his latest release, said his mind remained “stagnant and alone” despite the praise and compliments.
Please Wait while comments are loading...