»   » ఐశ్వర్యరాయ్ నయా అవతార్ (ఫోటో)

ఐశ్వర్యరాయ్ నయా అవతార్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాజీ అందాల సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ మార్చి-2015 సంచికపై సరికొత్త అవతారంలో దర్శనమిచ్చారు. డిఫరెంటు లుక్‌తో ఆమెను కవర్ పేజీపై ప్రజెంట్ చేసారు. ‘ఐశ్వర్యరాయ్... కంబ్యాక్? ఐ నెవెర్ వెంట్ ఎ వే' క్యాప్షన్‌తో ఉన్న కవర్ పేజీ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఐశ్వర్యరాయ్ సినిమాల విషయానికొస్తే...
బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుండి ఐశ్వర్యరాయ్ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె మళ్లీ సినిమాల్లో ఎప్పుడు నటిస్తుందో? అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఆమె ఆ దర్శకుడితో చేస్తుందా? ఈ నిర్మాణ సంస్థలో చేస్తుందా? అంటూ గత కొంతకాలంగా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

అయితే ఎట్టకేలకు ఐశ్వర్యరాయ్ సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభమైంది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఆమె బాలీవుడ్ మూవీ ‘జబ్బా' సినిమాలో నటిస్తోంది. యాక్షన్, థ్రిలర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ సంజయ్ గుప్తా ట్వీట్ చేసారు.

Aishwarya Rai is back in a New Avatar!

ఈ సినిమా కోసం ఐశ్వర్యరాయ్ గత కొంతకాలంగా సన్నద్ధం అవుతోంది. సినిమాలో తాను చేయబోయే పాత్రకు తగిన విధంగా శరీరాకృతిని మలుచుకుంది. ఇందులో ఆమె పలు యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటిస్తున్నట్లు సమాచారం. చాలా కాలం తర్వాత ఐశ్వర్యరాయ్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది. ఐశ్వర్యరాయ్ తో పాటు ఇర్ఫాన్ ఖాన్, షబానా అజ్మి, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్సెల్ విజన్ ప్రొడక్షన్స్ ప్రై.లి. వైట్ ఫాదర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

English summary
Aishwarya Rai features on the Cover of Vogue India magazine's March 2015 issue. The cover story was titled as 'Aishwarya Rai - Comeback? I Never Went Away?'
Please Wait while comments are loading...