మధూర్ బండార్కర్ శృంగార చిత్రంలో ఐశ్వర్యారాయ్..డిటేల్స్
బాలీవుడ్ అందాల సుందరి ఐశ్వర్యారాయ్ త్వరలో హాలీవుడ్ అంధ్బుతం మార్లిన్ మన్రో గా కనిపించనుంది.మొదట మార్లిన్ మన్రోగా కరీనా కపూర్ అయితే బాగుంటుందని అనుకున్నారు.అయితే ఆమె ఆసక్తి చూపకపోవటంతో ఆ ఆఫర్ ..ఐశ్వర్యని వరించింది.ఈ చిత్రాన్ని మార్లిన్ మన్రో జీవితాన్ని ఆధారం చేసుకుని మాధుర్ భండార్కర్ రూపొందించనున్నారు.మార్లిన్ మన్రో తన జీవితంలో మూడు సార్లు వివాహం చేసుకుని,అమెరికా అధ్యక్ష్యుడు జాన్.ఎఫ్.కెన్నడీతో నూ ఆయన సోదరుడుతోనూ ఒకే సారి ఎఫైర్స్ నడింపింది.ఇక ఈ సంచలన చిత్రం టైటిల్ ..హీరోయిన్ ,చిత్రనిర్మాత సిద్ధార్థ్‌రాయ్ కపూర్.ఇక కరీనా రిజెక్టు చేయటంతో దర్శకుడు మాధుర్ దృష్టిలో ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్ నిలిచారు.ఇద్దరూ ఈ చిత్రంలో చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.కానీ ఐశ్వర్య అంటే మాధుర్ బండార్కర్ కి ప్రత్యేమైన అభిమానం ఉంది.ఈ కారణంగా ఆమెకు తగినట్లుగా మార్చి ఈ కథ తయారుచేసారు.అయితే ఈ విషయం బయటికి రాకుండా ఐశ్వర్య రాయ్ ఈ చిత్రంలో నటించడానికి సంతకం చేసేశారని తెలుస్తోంది.మార్లిన్ మన్రోకు శృంగార తార ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే.తెరపై ఆమె స్థాయిలో శృంగారం ఒలికించడానికి ఐశ్వర్యరాయి సుముఖంగానే ఉండటం బాలీవుడ్ వాసులను ఆశ్చర్యపరుస్తోంది.ఇక ఈ చిత్రానికి పోటీనా అన్నట్లు తెలుగు శృంగార తార సిల్క్ స్మిత జీవితం ఆధారంగా డర్టీ పిక్చర్ టైటిల్ తో విద్యాబాలన్ ప్రధానపాత్రలో ఏక్తా కపూర్ ఓ చిత్రం రూపొందిస్తోంది.ఇక మధూర్ గత చిత్రాలు పేజ్ త్రీ,ఫ్యాషన్,చాందినీబార్ చిత్రాలను చూసినవారు ఈ చిత్రం ఏ రేంజిలో సంచలనం రేపనుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











