»   » ఐశ్వర్యరాయ్‌కి రూ.3 కోట్లు ఎగ్గొట్టిన నిర్మాతలు!

ఐశ్వర్యరాయ్‌కి రూ.3 కోట్లు ఎగ్గొట్టిన నిర్మాతలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ దాదాపు ఐదేళ్ల తర్వాత ‘జజ్బా' చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది. అయితే బాక్సాఫీసు వద్ద ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. నిర్మాతలకు నష్టాలే మిగిల్చిందని టాక్.

చాలా కాలంగా ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ సినిమా ఎలాంటిది ఎంచుకోవాలనే విషయంలో తర్జనభర్జనలు పడింది. తన ఎంట్రీ పవర్ ఫుల్ గా ఉండాలని... లేడీ ఓరియెంటెడ్ పవర్ ఫుల్ సబ్జెక్టు ఎంచుకుంది. ‘జజ్బా' సబ్జెక్టుతో దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించి ఒప్పించారు. రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసారు. ముందుగా కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్లు టాక్.

 Aishwarya Rai lost Rs 3 Crore for Jazbaa

అయితే షూటింగ్ పూర్తయినా నిర్మాతల నుండి మిగతా రూ. 3 కోట్లు మాత్రం ఐష్ కు చేరలేదు. దీంతో ఆమె ప్రమోషన్లలో పాల్గొనడానికి కూడా నిరాకరించారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన దర్శకుడు సంజయ్ గుప్తా... ఐష్ ను నిర్మాతల లిస్టులో చేర్చాడు. లాభాల్లో వాటా ఇప్పిస్తానని మాటిచ్చాడు. దీంతో కూల్ అయిన ఐష్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది.

అయితే బాక్సాఫీసు వద్ద ‘జజ్బా' ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో నిర్మాతలకు నష్టాలే మిగిలాయి. నష్టాల సాకుతో ఐశ్వర్యకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా పంగనామం పెట్టారట నిర్మాతలు. ఒకప్పుడు బాలీవుడ్లో తిరుగులేని హీరోయిన్ గా వెలిగిన ఐశ్వర్యరాయ్ కి రీ ఎంట్రీ తొలి స్టెప్పులోనే షాక్ తగిలినట్లయింది.

English summary
According to reports, Aishwarya Rai has lost almost Rs 3 Crore with her comeback flick ‘Jazbaa’.
Please Wait while comments are loading...