»   » మరో హాలీవుడ్ చిత్రంలో ఐశ్వర్యా రాయ్..

మరో హాలీవుడ్ చిత్రంలో ఐశ్వర్యా రాయ్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతంలో 'బ్రైడ్‌ అండ్‌ ప్రిజుడిస్‌', 'మిస్ట్రెస్‌ ఆఫ్‌ స్పీసిస్‌', 'ప్రొవోక్డ్‌', 'ది లాస్ట్‌ లీజియన్‌', 'పింక్‌ పాంథర్‌-2' వంటి హాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన ఐశ్వర్య రాయ్‌ తాజాగా మరో చిత్రం కమిట్ అయినట్లు సమాచారం. హాలీవుడ్ సూపర్ స్టార్ రస్సెల్‌ క్రోవ్‌ హీరోగా రూపొందబోయే చిత్రంలో ఐష్‌ ను ఎంపిక చేసుకున్నారని సమాచారం. రాబిన్ హుడ్ ప్రీమియర్ కి వచ్చినప్పుడు ఐశ్వర్యా రాయ్ ని ప్రత్యక్షంగా చూసిన రస్సెల్ క్రో ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. అందులోనూ ఆసియా మార్కెట్ రోజు రోజూకీ విపరీతంగా పెరుగుతున్న నేపధ్యంలో హాలీవుడ్ ఇక్కడ నటీనటులపై దృష్ఠి పెడుతోందంటూ కొందరు ఈ సంఘటనపై వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ చిత్రం దర్శకుడు..ఇతర నటీనటులు..సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడవుతాయి. కేన్స్‌ లో పాల్గొంటున్న ఐష్‌తో ఇప్పటికే ఈ సినిమా గురించిన చర్చ పూర్తయిందని..ఆమె కూడా నటించడానికి సిద్ధంగా ఉందని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu