»   »  వివాదం: మాజీ ప్రియుడికి ఐశ్వర్యరాయ్ సపోర్ట్!

వివాదం: మాజీ ప్రియుడికి ఐశ్వర్యరాయ్ సపోర్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అందాల సుందరి ఐశ్వర్యరాయ్ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన ఇద్దరూ విడిపోవడం.. సల్మాన్ తనపై దాడి చేసాడని ఐశ్వర్యరాయ్ ఆరోపణలు చేయడం, ఈ వ్యవహారంతో సల్మాన్ కొంతకాలం పిచ్చిపట్టినవాటిలా తయారవ్వడం...ఇదంతా గతం. సల్మాన్ ఈ గొడవ నుండి కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది.

అప్పటి నుండి ఇప్పటి వరకు ఇద్దరూ కలుసుకోవడం గానీ, కలిసి సినిమాల్లో నటించడం గానీ చేయలేదు. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్న సందర్భాలు కూడా తక్కువే. చాలా కాలం తర్వాత సల్మాన్ ఖాన్ మీద చెలరేగిన వివాదంపై ఐశ్వర్యరాయ్ స్పందించారు. సల్మాన్ కు మద్దతుగా మాట్లాడారు.

Aishwarya Rai supports Salman Khan for Rio Olympics 2016

రియో ఒలింపిక్స్ కు భారత్ నుంచి గుడ్ విల్ అంబాసిడర్‌గా సల్మాన్ ఎంపిక చేయడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. శనివారం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి ఈ వివాదం మొదలైంది. మొదట అంబాసిడర్ పదవిని షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లకు ఇవ్వాలని వారి పేర్లను పరిశీలించిన అధికారులు...చివరకు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సల్మాన్ ను ఫైనల్ చేసారు.

ఈ వివాదంపై ఐశ్వర్యరాయ్ ముంబైలో స్పందించాల్సిన సందర్భం వచ్చింది. ఐఓఏ నిర్ణయాన్ని మనం గౌరవించాలని ఐశ్యర్యరాయ్ అభిప్రాయపడింది. దేశం తరఫున వెళ్తున్న ఆటగాళ్లను ఎంకరేజ్ చేయడం, వారిని ఉత్తేజపరిచే సామర్థ్యమున్న వ్యక్తులు ఎవరినైనా ఈ పదవి వరించే అవకాశం ఉంది. ఐశ్వర్యరాయ్ కామెంట్స్ సల్మాన్ కు మద్దతుగా ఉండటం చర్చనీయాంశం అయింది.

English summary
Aishwarya Rai Bachchan, who openly supported the 'Bajrangi Bhaijaan' actor Salman's selection as the Goodwill Ambassador for the Rio Olympics.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu