»   »  కాన్స్ : ఐష్ లుక్ ఓసారి అందంగా, మరోసారి చెత్తగా (ఫోటోస్)

కాన్స్ : ఐష్ లుక్ ఓసారి అందంగా, మరోసారి చెత్తగా (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాన్స్: ఫ్రాన్స్ లో జరుగుతున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. గత 14 ఏళ్లుగా ఆమె ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొంటున్నారు. రెడ్ కార్పెట్ మీద ఐశ్వర్యరాయ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తుల్లో అందంగా మెరిసి పోతుంటే అభిమానులు చూసి నయనానందం పొందుతుంటారు.

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కాస్మోటిక్ సంస్థ ఎల్ ఓరియ‌ల్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్న ఐశ్వ‌ర్య రాయ్ దాన్ని ప్రమోట్ చేయడంలో భాగంగా 15 వ సారి ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కు విచ్చేసారు.

స్లాక్ బే చిత్ర ప్రిమియ‌ర్ షో సందర్భంగా ఈ సీజన్లో ఆమె తొలిసారి రెడ్ కార్పెట్ మీద నడిచారు. ఈ సందర్భంగా ఆమె కువైట్ కు చెందిన ప్రముఖ డిజైన‌ర్ అలీ యోనిస్ డిజైన్ చేసిన బంగారు వర్ణపు డ్రెస్సులో సూపర్ బ్యూటిఫుల్ లుక్ లో దర్శనమిచ్చారు.

రెండోసారి ఆమె గోల్డ్ లేస్ గౌనులో సూపర్ హాట్ లుక్ లో అభిమానుల మనసు దోచారు. ఈ డ్రెస్ ను ఎలీ సాబ్ డిజైన్ చేసారు. ఫస్ట్ డే కంటే సెకండ్ డే ఐష్ లుక్ మరింత ఆకట్టుకునే విధంగా ఉంది.

అయితే మూడో రోజు ఆమె పూల డిజైన్ తో ఉన్న గౌనులో..... పర్పుల్ కలర్ లిప్స్ తో కనిపించారు. ఆమె పెదాలకు పర్పుల్ కలర్ అద్దడం చాలా చెత్తగా ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇక సోషల్ మీడియాలో అయితే ఆమె పర్పుల్ కలర్ లిప్స్ మీద చాలా జోక్స్ పేలాయి.

స్లైడ్ షోలో ఫోటోస్...

అందంగా ఉంది

అందంగా ఉంది


రెండో రోజు ఐశ్వర్య రాయ్ ఇలా గోల్డ్ లేస్డ్ గౌనులో చాలా అందంగా కనిపించింది.

ప్రశంసలు

ప్రశంసలు


వయసు పైబడినా ఐశ్వర్యరాయ్ ఈ డ్రెస్సులో ఎంతో యంగ్ లుక్ తో కనిపించారనే ప్రశంసలు వెల్లువెత్తాయి.

అభిమానులు

అభిమానులు


ఐశ్వర్యరాయ్ అభిమానులైతే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో లైక్స్, షేర్ లతో హోరెత్తించారు.

హైలెట్

హైలెట్


ఇన్నేళ్లలో ఐశ్వర్యరాయ్ కాన్స్ ఫెస్టివల్ లో చాలా సార్లు పాల్గొన్నారు. అందులో ఈ లుక్ హైలెట్ గా నిలిచిపోయింది.

నచ్చలేదు

నచ్చలేదు


అయితే మూడో రోజు ఐశ్వర్యరాయ్ పెదాలకు పర్పుల్ కలర్ తో రావడం ఎవరికీ నచ్చలేదు.

చెత్తగా ఉంది

చెత్తగా ఉంది


పెదాలకు పర్పుల్ కలర్ వేయడం వల్ల ఆమె చాలా చెత్తాగా ఉందనే విమర్శలు వచ్చాయి.

సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో


ఐష్ పర్పుల్ కలర్ పెదాలపై సోషల్ మీడియాలో చాలా జోక్స్ పేలాయి.

ఊహించి ఉండరు

ఊహించి ఉండరు


ఐశ్వర్యరాయ్ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించి ఉండరు.

English summary
Aishwarya Rai, mesmerized people at the Cannes Film Festival with her beauty as she walked the red carpet in a stunning gold shimmering gown and a floral dress on the second day. Aishwarya Rai, sported a purple lipstick and Twitterati trolled the actress for her makeup antics! Check out funny tweets of people taking on Aishwarya Rai's purple lips here!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu