»   » దటీజ్ రజినీ.., తనమీద జోక్ కి తానే, నోట్లుమార్చుకోవటానికి వెళితే

దటీజ్ రజినీ.., తనమీద జోక్ కి తానే, నోట్లుమార్చుకోవటానికి వెళితే

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా ఎంత ఫేమసో.....ఆయనపై నెట్లో హల్ చల్ చేసే జోక్స్ కూడా అంతే ఫేమస్. రజనీని ఓ ఇంసిబుల్ పర్శన్ కింద చూపిస్తూ కొన్ని వందల జోక్స్ నెట్ లో దర్శనమిస్తాయి. ఆ జోకులు చూసి రజనీకాంత్ ఎలా ఫీల్ అవుతారేమో తెలీదు కానీ....జనాలు మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా తండ్రిపై వస్తున్న కామెడీ యాడ్స్ పై ఆయన కూతురు సౌందర్య రెస్పాండ్ అయ్యారు. మేము వాటిని చాలా పాసిటివ్ గా తీసుకుంటామని చెబుతున్నారు సౌందర్య. అంతేకాదు అవి చూసి మేము కూడా నవ్వుకుంటామంటున్నారు.

తాజాగా ఈ ఇంగ్లీష్ డైలీకి ఇంటర్వ్యూకి ఇచ్చిన ఐశ్వర్య.. కొత్త అవతారంతో కనిపించింది. స్లిమ్ గా మారిపోయిన లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో తన తండ్రితో అనుబంధాన్ని పంచుకున్న ఆమె.. నెట్ లో తన తండ్రిపై వచ్చే జోక్స్ గురించి కూడా మాట్లాడింది. వాటిని తాను చాలా ఎంజాయ్ చేస్తానన్న ఆమె.. కొన్నింటిని రజినీకి కూడా చెబుతుంటానని అన్నది. రీసెంట్ గా వచ్చిన డీమానిటైజేషన్ తర్వాత.. రజినీకాంత్ పై వచ్చిన జోక్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

 Aishwarya revealed her favorite Rajini joke

రజనీని మానవాతీత వ్యక్తిగా, ఎవరికీ సాధ్యం కాని పనులను చేసేవాడిగా చిత్రీకరిస్తూ జోక్‌లు పుట్టిస్తుంటారు కొంతమంది. మరి, ఇలాంటి జోక్‌ల విషయంలో రజనీకాంత్‌ ఎలా ఫీలవుతుంటారు? ఈ ప్రశ్నకు రజనీ కూతురు ఐశ్వర్య సమాధానం చెప్పింది.

తనపై ఇంటర్నెట్‌లోనూ, సోషల్‌ మీడియాలోనూ వచ్చే జోక్‌లను రజనీ ఇష్టపడతారట. తన మీద వచ్చే జోక్స్‌ను కూడా బాగా ఎంజాయ్‌ చేస్తారట. ఐశ్వర్య, సౌందర్య ఎప్పటికప్పుడు ఆ జోక్‌లను రజనీకి చెప్పి నవ్విస్తారట. ఇటీవల పెద్దనోట్ల రద్దు తర్వాత రజనీపై వచ్చిన ఓ జోక్‌ ఐశ్వర్యకు, రజనీకి బాగా నచ్చిందట.

ఇంతకీ ఆ జోక్ ఏమిటంటే... "పాత నోట్లను మార్చుకోవటానికి రజినీ బ్యాంక్ కి వెళ్ళాడు... వెంటనే బ్యాంకు మేనేజర్, స్టాఫ్ అందరూ, బ్యాక్ ఐడీ ప్రూఫ్ లతో స్దహా రజినీకి సమర్పించి నోట్లు తీసుకున్నారు" ఆ జోక్‌ను ఇంటర్నెట్‌లో చదివిన ఐశ్వర్య తండ్రికి చెప్పిందట. ఆ జోక్‌ విని రజనీ విపరీతంగా నవ్వుకున్నారట.

English summary
When asked about the hilarious ‘Rajini Jokes’ that storm the internet and outrageously elevates Rajini’s heroism though in a comic way, Aishwarya revealed her favorite Rajini joke – When Rajini goes to a bank to exchange his old currency notes after demonetization, the bank shows him its ID proofs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu