»   » అభిషేక్ మణిరత్నంకి అల్లుడు...ఐశ్వర్య రాయ్

అభిషేక్ మణిరత్నంకి అల్లుడు...ఐశ్వర్య రాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మణిరత్నం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రావణ్ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా ఆ చిత్రం హీరోయిన్న ఐశ్వర్య రాయ్ మాత్రం మణిపై ప్రేమాభిమానాలు కురిపిస్తోంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ...'విలన్ రూపొందించడం మణికి కూడా చాలా ఛాలెంజింగ్‌ గానే అనిపించింది. నాకు కూడా నేను చేసిన రాగిణి పాత్ర అంటే చాలా ఇష్టం. మణి నన్ను 'కన్నా' అని పిలుస్తారు. అభిషేక్‌ ను 'మాప్పిళే' (అల్లుడు) అని పిలుస్తారు. మాకు బాగా దగ్గరి వ్యక్తి మణి' అని ఆమె చెప్తోంది. అలాగే 'నేను ఎన్ని సినిమాల్లో నటించినా మణిరత్నం చిత్రాలంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంటూనే ఉంటుంది. ప్రతి సారీ ఆయనతో సినిమా పూర్తయిన వెంటనే తదుపరి చిత్రం ఎప్పుడు మొదలవుతుందా? అన్న కుతూహలం కూడా ఉంటుంది..ఇప్పుడు కూడా అలాగే ఉంది' అని చెప్పుకొచ్చింది ఐశ్వర్యరాయ్ బచ్చన్. ఓ ప్రక్క ఆమె మామగారు అమితాబ్ బ్లాగుల్లో రావణ్ చిత్రం గురించి తిట్టిపోస్తూంటే ఆమె ఇలా పొగడ్తల్లో ముంచెత్తుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu