»   » ప్రపంచవాప్తంగా క్రేజ్ సొంతం చేసుకొన్న ఆ ముగ్గురు !?

ప్రపంచవాప్తంగా క్రేజ్ సొంతం చేసుకొన్న ఆ ముగ్గురు !?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నడిచినా..పరుగెత్తినా..చేయి ఊపినా..గన్‌ తిప్పినా..సిగరెట్‌ వెలిగించినా ఆ స్టయిలే వేరు. ఆరు పదుల వయసులో కూడా ఆయన స్టయిల్‌ ఏమాత్రం తగ్గలేదు. ఎల్లలు దాటిన అభిమానం ఆయనకే సొంతం. ఆయనే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. తొలి చిత్రం 'జెంటిల్‌మాన్‌" నుంచి చివరి చిత్రం 'శివాజీ" వరకు శంకర్‌ పంథానే వేరు. భారీతనానికి మారుపేరు ఆయన. శంకర్‌ సినిమా అంటే మినిమం ముప్పై కోట్లు బడ్జెట్‌ తప్పనిసరి. తన అందంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదిం చుకుని బాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ స్థానాన్ని కొంగుకు ముడి వేసేసుకున్న ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌. ఈ ముగ్గురు ఎవరికి వారే ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ సొంతం చేసుకున్నారు. అటువంటిది వీరి కలయికలో సినిమా అంటే దానికెంత క్రేజ్‌ వుంటుందో వేరే చెప్పాలా? ఇప్పుడు అదే క్రేజ్‌ 'రోబో" సొంతం చేసుకుంది.

తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్‌ ఆవిష్కరిస్తున్నారు. వరుసగా భారీ విజయాలు నమోదు చేసుకుంటున్న శంకర్‌ 'రోబో" నా డ్రీమ్‌ ప్రోజెక్ట్‌" అన్నారంటే అది ఏస్థాయిలో వుంటుందో ఊహకు అందకపోవచ్చు. ఇలా అనేక ఊహలతో క్రేజీ చిత్రంగా రూపొందుతోన్న 'రోబో" చిత్రం దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకుంది. మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని వేసవి కానుకగా విడుదల కానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X