»   » ‘ఐతే 2.0’ సినిమా కాన్సెప్టు డిఫరెంటుగా ఉంది!

‘ఐతే 2.0’ సినిమా కాన్సెప్టు డిఫరెంటుగా ఉంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇంద్రనీల్‌ సేన్‌ గుప్తా, జారాషా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మృణాల్‌, మృదాంజలి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న సినిమా ‘ఐతే2.0'. ఫర్మ్‌ 9 బ్యానర్‌పై రాజ్ మాదిరాజ్ దర్శకత్వం తెరకెక్కుతోంది. కె.విజయరామరాజు, డా.హేమంత్ వల్లపురెడ్డి నిర్మాతలు. ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా...

దర్శకుడు రాజ్‌ మాదిరాజ్‌ మాట్లాడుతూ ఐతే 2.0 సినిమా సిహైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే సింగిల్‌ షెడ్యూల్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుని 45 రోజుల్లో పూర్తి కావాల్సిన చిత్రం 40 రోజుల్లోనే పూర్తి అయింది. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి సినిమా త్వరలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఐతే' సినిమా విడుదలై దాదాపు పన్నెండేళ్ళవుతోంది. చంద్రశేఖర్‌ యేలేటి, గుణ్ణం గంగరాజుగారు సైలైంట్‌గా ఒక సినిమాను ఎలా చేయవచ్చో చూపించారు. ఆ సినిమా అవార్డులతో పాటు చాలా మంది మెప్పించింది. అదే టైటిల్తో సినిమా చేస్తానని గుణ్ణం గంగరాజుగారిని అడిగితే ఆయన ఒప్పుకున్నారు. తెలుగులో ఇప్పటి వరకు రాని టెక్నో థ్రిల్లర్ జోనర్‌లో ఐతే 2.0 తెరకెక్కింది. ఈ వెర్షన్ ‘ఐతే' సినిమాకు ఈ సినిమా రీబూట్‌ వెర్షన్‌ లా ఉంటుంది. కానీ అంత సైలెంట్‌గా ఉండదు. టెక్నాలజీ వల్ల మనం ఎంజాయ్ చేస్తున్నాం కానీ కొందరు తమ చేతుల్లో ఉంచుకుని మనతో ఆటలాడుకుంటున్నారనే సంగతిని మనం మరచిపోతున్నాం. వాటి పరిణామాలేంటి అనే విషయాన్నే ఈ చిత్రంలో చూపించబోతున్నాం. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

నిర్మాతలు కె.విజయరామరాజు, డా.హేమంత్ వల్లపురెడ్డి మాట్లాడుతూ ‘'దర్శకుడు రాజ్ మాదిరాజ్ గారు సినిమాను పక్కా ప్లానింగ్ తో చేయడం వల్ల అనుకున్న సమయం కంటే సినిమా చిత్రీకరణను ముందుగానే పూర్తి చేయగలిగాం. మంచి టీంతో సినిమాను రూపొందించాం. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్స్ చేస్తున్నాం'' అన్నారు.

ఇంద్రనీల్‌ సేన్‌ గుప్తా, జారాషా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మృణాల్‌, మృదాంజలి,డా॥శ్రీకాంత్‌, జీవా తారాగణం. ఈ చిత్రానికి కెమెరా: కౌశిక్‌ అభిమన్యు, సంగీతం: అరుణ్‌ చిలువేరు, ఆర్ట్‌: రాజీవ్‌ నాయర్‌, ఎడిటింగ్‌: శశాంక్‌ మాలి, డ్యాన్స్‌: చంద్రకిరణ్‌, మాటలు, పాటలు: కిట్టు విస్సాప్రగాడ, ప్రొడక్షన్‌ డిజైన్‌: మహేష్‌ చదలవాడ, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: కళ్యాణం మురళి, నిర్మాతలు: కె.విజయరామరాజు, డా॥హేమంత్‌ వల్లపురెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్‌ మాదిరాజు.

English summary
Director Raj Madiraju's upcoming movie Aithe 2.0 has completed the shooting. Produced jointly by Dr Hemanth Pallapureddy and K Vijayarama Raju, the film features ensemble cast of Indraneel Sengupta, Zarasha, Abhishek, Karthavya Sharma, Neerak, Mrunal and Mrudanjali in lead roles.
Please Wait while comments are loading...