»   » ఆర్జీవి శిష్యుడి దర్శకత్వంలో ఆర్ఎక్స్ 100.. ప్రీలుక్‌కు విశేష స్పందన

ఆర్జీవి శిష్యుడి దర్శకత్వంలో ఆర్ఎక్స్ 100.. ప్రీలుక్‌కు విశేష స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఆర్ఎక్స్ 100. యాన్ ఇన్‌క్రెడిబుల్ లవ్‌స్టోరి ఉపశీర్షిక. కార్తికేయ, పాయల్ రాజపుట్ ఇందులో హీరోహీరోయిన్లు. కేసీడబ్ల్యూ బ్యానర్‌పై అశోక్‌రెడ్డి గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రీలుక్‌ను ఆదివారం విడుదల చేశారు.

ఆర్ఎక్స్ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రావురమేష్, సింధూర పువ్వు రాంకీ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైలీ ఎమోషనల్ రియలిస్టిక్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక బృందం పని చేస్తోంది.

Ajay Bhupathi debut movie RX100 pre look released

నేషనల్ అవార్డు విన్నర్ ప్రవీణ్ కే ఎల్ ( 'కబాలి' ఫేమ్ ) ఈ చిత్రానికి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. తెలుగులో ఆయనకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. వేసవిలో సినిమాను విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

నటీనటులు
కార్తికేయ, పాయల్ రాజపుట్, రావు రమేష్, రాంకీ ( సింధూర పువ్వు ఫేమ్ ), సత్య, గిరిధర్, లక్ష్మణ్.

సాంకేతిక వర్గం:
మ్యూజిక్: చైతన్ భరద్వాజ్ ,లిరిక్స్: శ్రీమణి , చైతన్య ప్రసాద్,సిరాశ్రీ, కొరియోగ్రఫీ:స్వర్ణ, అజయ్,సురేష్ వర్మ, స్టంట్స్: రియల్ సతీష్ , ఆర్ట్ డైరెక్టర్: రఘు కులకర్ణి, ఎడిటర్: ప్రవీణ్. కే .ఎల్ ( కబాలి ఫేమ్ ), సినిమాటోగ్రఫీ: రామ్ ,పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే, ఎగ్జిక్యూటివ్: సూర్య నారాయణ, నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ , రచన-దర్శకత్వం: అజయ్ భూపతి.

English summary
RX100 movie - An Incredible Love Story, Produced under Title KCW. Ajay Bhupathi is making debute with this film who worked as Assistant Director for Few films with Star Director RGV which is Highly Emotional Realistic Love Story and it stars Kartikeya, Paayal Rajput in lead roles, Rao Ramesh and Ramki were playing Key roles. Editor Praveen K.L ( Kabali Fame ) is working for the straight telugu film for the first time who is own National and state awards
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu