»   » నాగ చైతన్య కొత్త చిత్రం షెడ్యూలు...

నాగ చైతన్య కొత్త చిత్రం షెడ్యూలు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య, అజయ్ భుయాన్ కాంబినేషన్ లో రూపొందనున్న కొత్త చిత్రం మే నెల రెండో వారం నుండి షూటింగ్ ప్రారంభం అవనుంది. షూటింగ్ లో మొదటి ఇరవై నాలుగు రోజులు లాస్ ఏంజల్స్, లాస్ వేగాస్, శాన్ ప్రాన్సిన్స్ కో లో జరుగుతుంది. అలాగే అక్కడే ఉన్న గోల్డెన్ గేట్ బ్రిడ్జిపై ఓ ప్రత్యేకమైన సన్నివేశం చిత్రీకరించనున్నారు. ఇక ధాయ్ లాండ్ లో రెండు పాటలు, యాక్షన్ సన్నివేసాలు ఇరవై రెండు రోజులు పాటు చిత్రీకరించేలా ప్లాన్ చేసారు. కింగ్, కేడీ చిత్రాలు నిర్మించిన శివ ప్రసాద్ రెడ్డి తమ కామాక్షి బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగచైతన్య హీరోగా చేసిన ఏ మాయ చేసావే చిత్రం మంచి హిట్ అవటంతో ఈ చిత్రంపై మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉంది. ఓ మాస్ మశాలా మూవీ గా ఈ చిత్రాన్నీ రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు అజయ్ భుయాన్ దర్శకత్వంలో చంద్రమహేష్ నిర్మించిన హౌస్ ఫుల్ చిత్రం ఇంకా రిలీజ్ కాలేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu