»   » ఏడుస్తూ వెళ్లి పోయిన హీరోయిన్ కాజోల్, ఏమైంది?

ఏడుస్తూ వెళ్లి పోయిన హీరోయిన్ కాజోల్, ఏమైంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: హీరోయిన్ కాజోల్ గతవారం బాలీవుడ్లో ఓ కార్యక్రమంలో తన సదరి తానిషా ముఖర్జీతో కలిసి పాల్గొన్నారు. అయితే ఉన్నట్టుండి ఆమె కార్యక్రమం మధ్యలోని నుండి ఏడుస్తూ వెళ్లి పోయింది. ఓ ఫోన్ కాల్ కారణంగానే ఆమె ఉన్నట్టుండి అలా వెళ్లి పోయారు. అయితే ఆమె అలా ఎందుకు మధ్యలో నుండి వెళ్లి పోయిందో ఎవరికీ అర్థం కాలేదు.

తాజాగా కాజోల్ వెళ్లి పోవడానికి కారణం ఏమిటో తెలిసి పోయింది. కాజోల్-అజయ్ దేవగన్ దంపతుల కుమారుడు యుగ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడట. విషయం తెలిసిన వెంటనే కాజోల్ తల్లడిల్లిపోయింది. వెంటనే కార్యక్రమం మధ్యలో నుండి లేచి వెల్లి పోయింది.

Ajay Devgan tells why worried Kajol left event midway!

ఇటీవల అజయ్ దేవగన్ తన ట్విట్టర్ ద్వారా యుగ్ అనారోగ్యం పాలైన విషయాన్ని వెల్లడించారు. యుగ్ ఇపుడు పూర్తిగా కోలుకున్నాడని, స్కూలుకు కూడా వెలుతున్నాడని అజయ్ దేవగన్ తెలిపారు. తన కొడుకు ఆరోగ్యం బాగు పడాలని కోరుకున్న వారందరికీ ఈ సందర్భంగా అజయ్ దేవగన్ థాంక్స్ చెప్పారు.

కాజోల్ సినిమా విషయానికొస్తే...
ప్రస్తుతం కాజోల్, షారుక్ హీరోగా తెరకెక్కుతున్న దిల్ వాలె చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్లో షారుక్-కాజోల్ జోడీ అంటే చాలా ఫేమస్. బాలీవుడ్ ఐకానిక్ ఫిల్మ్స్ బాజిగర్, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, కుచ్ కుచ్ హోతా హై లాంటి ఆల్ టైం హిట్ చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ ఆ మధ్య ‘మై నేమ్ ఈజ్ ఖాన్' అనే చిత్రంలోనూ జోడీ కట్టారు. ఇపుడు ‘దిల్ వాలె' చిత్రంలో నటిస్తున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం డిసెంబర్ 18న ఈ సినిమా విడుదల కానుంది.

English summary
Kajol left her sister Tanishaa Mukerji's play midway last week, after receiving a phone call. A report in Bollywoodlife.com mentioned the reason why Kajol left the event midway. Apparently, Kajol and Ajay’s son Yug was unwell.
Please Wait while comments are loading...