»   » పాకిస్థాన్ ఇష్యూ: భర్త అజయ్ దేవగన్ నిర్ణయానికి కాజోల్ సపోర్ట్

పాకిస్థాన్ ఇష్యూ: భర్త అజయ్ దేవగన్ నిర్ణయానికి కాజోల్ సపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యూరి ఘటన తర్వాత భారత్-పాకిస్థాన్ బోర్డర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇండియన్ సినిమాల్లో నటిస్తున్న పాకిస్థాన్ నటులు భారత్ విడిచి వెళ్లి పోవాలని కొన్ని రాజకీయ పార్టీలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. కొందరు దర్శక నిర్మాతలు వారికి అవకాశాలు ఇచ్చేది లేదంటూ నిషేదం విధించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఈ వివాదాస్పద అంశం విషయంలో బాలీవుడ్ స్టార్స్ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసారు. సల్మాన్ ఖాన్, మరికొందరు స్టార్స్ పాకిస్థాన్ నటులకు మద్దతుగా నిలిచారు. మరికొందరు పాక్ నటులతో కలిసి నటించబోమని ప్రకటించారు.

Ajay Devgn

భారత్‌లో పాకిస్థాన్ నటులు నటించకూడదని, వారిపై నిషేధం విధించాలనే అంశంపై బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గన్‌ స్పందిస్తూ...ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌ నటులతో కలిసి నటించడానికి తాను ఎంత మాత్రం సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. అజయ్‌ వ్యాఖ్యలకు కాజోల్‌ మద్దతు పలికింది.

ప్రస్తుత పరిస్థితుల్లో కళాకారులందరూ దేశానికి మద్దతుగా నిలవాలని ఆయన అన్నారు. ప్రస్తుతం నాకు దేశ ప్రయోజనాలే ముఖ్యం... పాక్ నటులతో నటించను, నా సినిమాలు పాకిస్థాన్‌లో విడుదల అవుతాయా.. లేదా అనే దాన్ని పట్టించుకోను అంటూ మీడియాతో వ్యాఖ్యానించారు. పాక్ నటులకు సల్మాన్‌, కరణ్‌జోహార్‌ లాంటి వారు మద్దతు ఇవ్వడం విచారకరం అంటూ వ్యాఖ్యానించారు.

English summary
On being asked whether he would work with the Pakistani actors, Devgn said, “Not at the moment. I heard some people say that talks are the only way to continue. I want to see you getting into a fight with somebody after he gives you a tight slap on your face and you say ‘let’s have a talk right now.’”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu