»   » రామ్‌దేవ్ బాబా గా యాక్షన్ హీరో: యోగాగురు పాత్రలో బాలీవుడ్ స్టార్

రామ్‌దేవ్ బాబా గా యాక్షన్ హీరో: యోగాగురు పాత్రలో బాలీవుడ్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడు ఎటు చూసినా బయోపిక్ ల రాజ్యం నడుస్తోంది. యోగా గురువు రాందేవ్‌ బాబా జీవితం ఆధారంగా సినిమా తీస్తారా..తీస్తే...ఎవరు హీరోగా చేస్తారు... అనే సందేహం వస్తుంది. రాందేవ్ బాబా జీవితంపై ఓ టీవీ షో చేయాలనుకున్నారట. అందులో విక్రాంత్ మస్సే అనే బుల్లితెర నటుడ్ని తీసుకోవాలని అనుకున్నారు.

కానీ వ్యక్తిగత కారణాల వల్ల విక్రాంత్ టీవీ షో నుంచి తప్పుకున్నారట.దాంతో ఇక సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. బయోపిక్లో రాందేవ్ రాజకీయ సంబంధాలు, పతంజలి తదితర అంశాలను చూపించనున్నారు. ప్రస్తుతం అజయ్ దేవగణ్ 'గోల్మాల్ ఎగైన్', 'బ్యాటిల్ ఆఫ్ సారాగర్హి' చిత్రాల్లో నటిస్తున్నారు. మొన్నటికి మొన్న ధోని బయోపిక్ వస్తే.. అది పోయిన కొన్ని నెలలకే సచిన్ బయోపిక్ వచ్చేసింది.

Ajay Devgn to play Baba Ramdev in film based on yoga guru

ఇటు పలువురు రాజకీయ నాయకులకు సంబంధించిన జీవిత కథలను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు సినీ పెద్దలు. ఆ జాబితాలోకి బాబాలు కూడా చేరిపోతున్నారు. యోగాసనాలతో, ఇండియన్ బ్రాండ్ అంటూ పతంజలి ఆయుర్వేద వ్యాపార సామ్రాజ్యాధినేతగా బాబా రాందేవ్ దాదాపు అందరికీ సుపరిచితులే. ఇప్పుడు ఆయన బయోపిక్‌కు రంగం సిద్ధమవుతోంది. శివాయ్‌గా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్‌నే మూటగట్టుకున్న అజయ్ దేవ్‌గణ్ రాందేవ్ పాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తోంది.

అయితే.. ఇదివరకే బుల్లితెరపై రాందేవ్ జీవితాన్ని హిందీ బుల్లితెర ప్రముఖుడు విక్రాంత్ మాసేతో తీయాలని చూసినా.. అది ఆచరణకు నోచుకోలేదు. దీంతో అజయ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ''అజయ్ దేవ్‌గణ్ రాందేవ్ బాబా జీవిత చరిత్రను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేయబోతున్నారు. దీనిపై చర్చలు సాగుతున్నాయి. అజయ్ తీద్దామనుకున్న 'బ్యాటిల్ ఆఫ్ సర్గారి' అనే సినిమాలో ఎలాంటి పురోగతి లేనందున రాందేవ్ బయోపిక్‌కు సిద్ధమవుతున్నారు'' అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అజయ్ దేవ్‌గణ్ 'గోల్‌మాల్ ఎగైన్' అనే సినిమాలో నటిస్తున్నారు.

English summary
Ajay Devgn to play Baba Ramdev in film based on yoga guru, after Vikrant Massey opts out?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu