»   » ఇలియానా వెంటపడుతున్న బాలీవుడ్ హీరో.. లేట్ వయసు ఆరాటం.. టోటల్ ఢమాలేనట..

ఇలియానా వెంటపడుతున్న బాలీవుడ్ హీరో.. లేట్ వయసు ఆరాటం.. టోటల్ ఢమాలేనట..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో అజయ్ దేవగన్‌ వివాదాలకు దూరంగా ఉంటాడు. ఆయన గురించిన రూమర్ ఒకటి సినీ పరిశ్రమలో తిరుగుతున్నది. లేటు వయసులో అజయ్ దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన హీరోయిన్‌పై మోజు పడుతున్నట్టు సమాచారం. ఇంతకీ ఆమె ఎవరో కాదు గోవా సుందరి ఇలియానా డీక్రజ్. ఆమెను తీసుకోవాలని పలువురు నిర్మాతలకు సిఫారసు చేయడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

బాద్షాహో చిత్రంలో

బాద్షాహో చిత్రంలో

మిలన్ లుథ్రియా రూపొందించిన బాద్షాహో చిత్రంలో ఇలియానా, అజయ్ దేవగన్ కలిసి నటించాడు. ఆ సమయంలోనే ఇలియానాపై అజయ్ మనసుపడేసుకున్నాడట. ఆ క్రమంలోనే పలువురు నిర్మాతలకు ఆయన సూచిస్తున్నాడట.

రైడ్ చిత్రంలో

రైడ్ చిత్రంలో

రాజ్‌కుమార్ గుప్తా రూపొందించే రైడ్ చిత్రం కోసం ఇలియానా పేరును సిఫారసు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ చిత్రం వచ్చేనెల ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

 టోటల్ ఢమాలేనట

టోటల్ ఢమాలేనట

ఇక ఆ విషయం అలా ఉంచితే తాజాగా, టోటల్ ఢమాల్ అనే సినిమా కోసం కూడా ఇలియానాను తీసుకోవాలని ఆ నిర్మాతకు సూచించారట. దాంతో వారి మధ్య ఏదో ఉందనే మాట బాలీవుడ్ కథనాల్లో వెల్లడైంది.

గాలివార్త నా చెవిన పడింది

గాలివార్త నా చెవిన పడింది

ఆ గాలి వార్త బ్యూటీ ఇలియానా చెవిన పడిందట. దాంతో ఆమె అగ్గిమీద గుగ్గిలం అయిపోయి.. టోటల్ ధమాల్ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. నా చెవికి గమ్మత్తైన వార్తలు వినిపిస్తున్నాయి అని ఇలియానా పేర్కొన్నది.

 చెత్త వార్తలతో బాధపడ్డాను

చెత్త వార్తలతో బాధపడ్డాను

అలాంటి చెత్త వార్తలు నన్ను ఆశ్చర్యానికి గురిచేయలేదు. కానీ జనాలు ఇలాంటి వార్తలు రాయడం నాకు బాధ కలిగింది. అజయ్ అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. అంతే తప్ప నాకు ఆయనకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అని ఇలియానా స్పష్టం చేసింది.

అజయ్ వల్లనే ఆఫర్ వచ్చింది

అజయ్ వల్లనే ఆఫర్ వచ్చింది

అజయ్ దేవగన్ సిఫారసు కారణంగానే నాకు రైడ్ సినిమా అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని చెప్పడానికి నాకు ఎలాంటి భయం లేదు. ఆ తర్వాత మరే సినిమా కోసం నన్ను సిఫారసు చేయలేదు.

 అర్జున్‌కపూర్‌ కూడా

అర్జున్‌కపూర్‌ కూడా

అలాగే ముబారకన్ చిత్రంలో అర్జున్ కపూర్‌తో కలిసి నటించాను. ఆయన కూడా ఓ స్క్రిప్టును రికమెండ్ చేశారు. తోటి నటిగా నా టాలెంట్‌ను చూసి ఎవరైనా సిఫారసు చేసే వీలుంటుంది. అంత మాత్రాన రిలేషన్స్ అంటగడుతారా అని ఇలియానా ఆవేదన వ్యక్తం చేసింది.

English summary
The rumour mills have been churning out story after story of how Ajay Devgn has taken a fancy to Ileana D'Cruz after working with her in Milan Luthria's Baadshaho. Speculation is rife that he not only recommended her name for Raj Kumar Gupta's Raid, which hits the screens later this month, but also his other projects, including Total Dhamaal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu