అజయ్ దేవగన్ కుటుంబంలో విషాదం.. తండ్రి మరణం నుంచి కోలుకోకముందే..
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకొన్నది. అజయ్ దేవగన్ సోదరుడు, దర్శకుడు అనిల్ దేవగన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 51 సంవత్సరాలు. తన సోదరుడి మరణంతో పుట్టెడు శోకంలో మునిగిపోయిన అజయ్‌కి స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు సంతాపం ప్రకటించారు. అనిల్ దేవగన్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితంలోకి వెళితే...

బాలీవుడ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా
బాలీవుడ్‌లో అనిల్ దేవగన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను ఆరంభించారు. పూల్ ఔర్ కాంటే, జాన్, ఇతిహాస్, ప్యారాహోనా హై తా చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత అజయ్ దేవగన్ నిర్మించిన రాజు చాచాతోపాటు బ్లాక్ మెయిల్, హాల్ ఏ దిల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా అజయద్ దేవగన్ దర్శకత్వం వహంచిన సన్ ఆఫ్ సర్దార్ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.

కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో
అయితే అనిల్ దేవగన్ కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకొంటూ కోలుకొంటున్నట్టు కనిపించారు. కానీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో అనిల్ అక్టోబర్ 6వ తేదీన తుదిశ్వాస విడిచారు అని కుటుంబ సభ్యులు తెలిపారు.

అజయ్ దేవగన్ ట్వీట్ చేసి
తన సోదరుడు అనిల్ మృతిని అజయ్ దేవగన్ ధృవీకరిస్తూ ట్వీట్ చేశారు. నా సోదరుడు అనిల్ దేవగన్ గత రాత్రి మరణించారు. అనిల్ మరణం మా కుటుంబాన్ని పుట్టెడు దు:ఖంలో ముంచింది. అనిల్ లేని లోటు తలచుకొంటే చాలా బాధగా ఉంది. అనిల్ ఆత్మకు శాంతి చేకూరాలి. కరోనావైరస్ కారణంగా నా సోదరుడి సంతాప సభను నిర్వహించడం లేదు అని అజయ్ దేవగన్ ట్వీట్‌లో వెల్లడించారు.
Recommended Video

అజయ్ దేవగన్ కుటుంబానికి వరుస విషాదాలు
అజయ్ దేవగన్ కుటుంబాన్ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కొద్ది నెలల క్రితం తన తండ్రి, బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ వీరూ దేవగన్ గుండెపోటుతో మరణించడం తెలిసిందే. ఆ విషాదాన్ని మరిచిపోకముందే అనిల్ దేవగన్ మరణించడం కుటుంబాన్ని మరింత విషాదానికి గురిచేసింది.


Click it and Unblock the Notifications











