»   » ప్రేమించి పెళ్లాడిన ఆ హీరో,హీరోయిన్స్ కి ఇంత పెద్ద అమ్మాయా? అంతా షాక్

ప్రేమించి పెళ్లాడిన ఆ హీరో,హీరోయిన్స్ కి ఇంత పెద్ద అమ్మాయా? అంతా షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మేము ఇక్కడ చెప్పబోయే న్యూస్ కానీ ఫొటోలు కానీ చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతారు. అదేమిటంటే బాలీవుడ్ యాక్షన్ హీరో, మాజీ హీరోయిన్ కాజోల్ ల కుమార్తె గురించి. ఈ జంటకు ఇంత పెద్ద కుమార్తె ఉందా అనుకునే ఫొటోలు మీరు క్రింద చూడండి.

అజయ్ దేవగన్ ఆయన కుమార్తె న్యాస తో కలిసి ఓ ఛారిటీ ఈవెంట్ గా రీసెంట్ గా వచ్చారు. అక్కడ ఫొటోలు ఇవి. తండ్రి, కుమార్తె కలిసి ఉండగా చూసిన జనం ..ఆశ్చర్యపోయారు. నిజమా అజయ్ దేవగన్ ఇంత పెద్ద కుమార్తె ఉందా అనటం వినిపించింది.

అయితే అజయ్ దేవగన్ వివాహం అయ్యి చాలా కాలం అయ్యింది. కానీ నిజానికి అజయ్ దేవగన్ కుమార్తె బాలీవుడ్ ప్రపంచానికి కూడా తెలియనంత సీక్రెట్ గా ఉండిపోయింది. ఆమె పెద్దగా పార్టీలలో కనపడదు. ఆమె ఫొటోలు మీడియాలో రావు. దాంతో అందరూ ఈమె చూసి నోరు వెళ్లబెట్టి చూసారు.

అందుకోసమే కలిసి వచ్చారు

అందుకోసమే కలిసి వచ్చారు

షి కెన్ ఫ్లై అనే ఈవెంట్ లో వీళ్ళిద్దరూ కనిపించారు. స్మైల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈవెంట్ అది. ఇదో కాంపైన్. ఆడపిల్లల ఆలోచనలు , ఏస్పరేషన్స్, కలలును గుర్తించండి అంటూ ఓ ఎవేర్ నెస్ కాంపైన్ ఇది. ఈ కాంపైన్ కు అజయ్ ఇలా తన కుమార్తె ని తీసుకొచ్చి సర్పైజ్ ఇచ్చారన్నమాట.

 అచ్చం తల్లిలాగే ఉందే

అచ్చం తల్లిలాగే ఉందే

ఈ ఈవెంట్ లో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది. ఈమెను చూసిన అందరూ కాజోల్ నే గుర్తు చేసుకున్నారు. 1990లో కాజల్ ఇలాగే ఉండేది అనేసారు. బాలీవుడ్ మీడియా అంతా ఇదే మాట్లాడింది. అప్పట్లో కాజోల్ ఇలాగే కళ్లజోడు పెట్టుకుని ఉండేది.

రీసెంట్ గా మరోసారి

రీసెంట్ గా మరోసారి

ఈ మధ్యనే అజయ్ దేవగన్ తన కుమార్తెతో కలిసి ఓ ఈవెంట్ లో రెడ్ కార్పెట్ పై నడిచారు. అప్పుడు ట్విట్టర్ లో ఆమె ఫొటో పోస్ట్ చేసారు. ఇప్పుడు బాలీవుడ్ మీడియా అంతా ఆమెను గుర్తు పడుతోంది. ఈమె పొటోలతో బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది.

అవును అంతే వయస్సు

అవును అంతే వయస్సు

న్యాసా అనే పేరు గల ఈ అమ్మాయి వయస్సు 13 సంవత్సరాలే. ఈ అమ్మాయి అంటే అజయ్ దేవగన్ కు బాగా గారం. అయితే తన పిల్లలను సినిమా షూటింగ్ లకు, ఈవెంట్స్ తీసుకురావటం ఇష్టంలేదని ఆయన గతంలో స్పష్టం చేసారు. అదే మాట మీద ఆయన సొంత సినిమా ఫంక్షన్స్ కు పిల్లలను ఎంకరేజ్ చెయ్యరు.

అప్పుడే రాసేస్తారా

అప్పుడే రాసేస్తారా

అజయ్ దేవగన్ కుమార్తెను చూసిన బాలీవుడ్ మీడియా..ఆమె కూడా త్వరలో సినిమాల్లోకి రాబోతోదంటూ కథనాలు ప్రచురించింది. ఇవన్నీ అజయ్ కొట్టిపారేస్తున్నారు. తన పిల్లలు నిజంగా సినిమా పరిశ్రమను ఎంచుకుంటే తను అభ్యంతరం చెప్పను కానీ ప్రస్తుతానికి వారి దృష్టి చదవుమీదే ఉందన్నారు.

హై సర్కిల్స్ లో ఉండరు

హై సర్కిల్స్ లో ఉండరు

పిల్లల భాధ్యత పూర్తిగా కాజోల్ చూస్తూంటుంది. మిగతా స్టార్స్ పిల్లలు సాయింత్రం అయితే పబ్ లు,పార్టీలు అంటూ తిరిగుతూంటే అజయ్ పిల్లలు మాత్రం అలాంటిదేమీ లేదు అంటున్నారు. వారిని హై సర్కిల్స్ లో గానీ, పార్టీల్లో కానీ ఎక్కడా చూడలేదని బాలీవుడ్ అంటోంది. అంటే ఇంకా బాలీవుడ్ లక్షణాలు అబ్బలేదన్నమాట.

కామెడీ సినిమాలు తన పిల్లల కోసమే

కామెడీ సినిమాలు తన పిల్లల కోసమే

అజయ్ దేవగన్ కొన్ని కామెడీ సినిమాలు చేసారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేసే అజయ్...కొన్ని కామెడీ సినిమాలు చేయటానికి కారణం తన పిల్లలే అని చెప్తాడు. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమాల్లోనే నటిస్తానని అసభ్యకరమైన సినిమాలకు దూరం అని అంటారు.

సినిమాల్లోకి ఎంట్రీ

సినిమాల్లోకి ఎంట్రీ

అజయ్ కుమార్తె నైసా ఫొటో ఇన్ స్టాగ్రామ్ లో ప్రత్యక్షమై హల్ చల్ చేస్తున్నాయి. అయితే భవిష్యత్ లో నైసా కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించాలన్న ఆలోచనలో ఉన్నారా..లేక తమ గారల పట్టి అంతరికీ సర్ఫైజ్ గా చూపించాలనికున్నారా తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ నెట్ వర్క్ లో అయితే ఈ ఫోటో తెగ హల్ చల్ చేస్తుంది.

 తల్లి ఎంకరేజ్ మెంట్

తల్లి ఎంకరేజ్ మెంట్

తాజాగా కాజోల్‌, ఆమె కూతురు నైసా ఫొటో ఇన్ స్టాగ్రామ్ లో హల్ చల్ చేస్తోంది.ఈ మధ్య నటించిన దిల్ వాలే మూవీ తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో జాయిన్ అయింది కాజోల్‌. ఇంతకు ముందు తన కుమారుడు యుగ్, అజయ్ దేవగన్ తో కలిసి దిగిన ఫొటోలు పోస్ట్ చేసింది కాజోల్‌. ఇలా తన పిల్లలిద్దరినీ సోషల్ మీడియాలో సెలబ్రెటీలను చేస్తున్నారు ఆ తల్లితండ్రులు.

ఇష్టపడడు అజయ్

ఇష్టపడడు అజయ్

ప్రేమ పెళ్లితో అన్యోన్యంగా జీవిస్తున్న అజయ్, కాబోల్ తన పర్శనల్ లైఫ్, ప్రొఫిషనల్ లైఫ్ ని విడతీసే చూస్తున్నారు. కలపటానికి ఇష్టపడటం లేదు. తమ కుటుంబానికి సంబంధింన పర్సనల్ ఫోటోలు కానీ పర్సనల్ విషయాలు కానీ ఎప్పుడూ బయట పట్టలేదు. ఏదైనా ఇంటర్వ్యూలో కూడా అజయ్ దేవగన్ కానీ కాజల్ కానీ తమ కుటుంబ విషయాలు అస్సలు బయట పెట్టేవారు కాదు. ఇద్దరు ఇండస్ట్రీ బ్యాగ్ గ్రౌండ్ నుంచి వచ్చినవారే అయినా ఇంట్రస్ట్ చూపలేదు.

English summary
Ajay Devgn and his daughter Nysa stepped out for a charity event recently. The father-daughter duo were spotted at a Smile foundation event unveiling #SheCanFly campaign that would aim to spread awareness about the aspirations and dreams of the girl child.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu