»   » ఆ విషయంలో అజిత్ వెనుకడుగు.. ఎందుకో.. భయపడ్డాడా!

ఆ విషయంలో అజిత్ వెనుకడుగు.. ఎందుకో.. భయపడ్డాడా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళంలో అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం వివేకం. ఈ చిత్ర విడుదల వాయిదా పడింది. అనుకున్న ప్రకారం కాకుండా మరో తేదీన విడుదల చేయాలని నిర్మాత త్యాగరాజన్ నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు చిత్ర యూనిట్ నుంచి ఓ ప్రకటన వెలువడింది.

వాయిదా పడ్డ వివేకం విడుదల

వాయిదా పడ్డ వివేకం విడుదల

షూటింగ్ ప్రారంభించడానికి ముందే వివేకం చిత్రాన్ని తొలుత ఏప్రిల్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ సమయంలో భారీ చిత్రాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఈద్ సందర్భంగా జూన్ 23వ తేదీని విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఈ తేదీకి కూడా విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదు.

ఆగస్టు 10 తేదీన విడుదలకు ఏర్పాట్లు?

ఆగస్టు 10 తేదీన విడుదలకు ఏర్పాట్లు?

ఈ చిత్రాన్ని ఆగస్టు 10న విడుదల చేయాలని నిర్ణయించినట్టు మరో వార్త తమిళ ఫిలింనగర్‌‌లో ప్రచారంలో ఉంది. పంద్రాగస్టును పురస్కరించుకొని విడుదల చేస్తే సుదీర్ఘమైన వారాంతం ఉండే అవకాశముంది. దాంతో కలెక్షన్లు కూడా భారీగా రావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ చిత్రం దాదాపు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది.

సిక్స్ ప్యాక్‌కు రెస్సాన్స్ అదుర్స్

సిక్స్ ప్యాక్‌కు రెస్సాన్స్ అదుర్స్

వివేగమ్ చిత్రం కోసం అజిత్ సిక్స్ ప్యాక్ అవతారం ఎత్తేశాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ అదరగొట్టేసింది. సిక్స్ ప్యాక్ నిలువెత్తు విగ్రహంతో ఉన్న పోస్టర్‌కు దక్షిణాది నటులే కాకుండా బాలీవుడ్ అగ్రహీరోలు ఫిదా అయ్యారు. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్, రానా, సల్మాన్, నయనతార తదితరులు ట్విట్టర్ లో సూపర్ అంటూ స్పందించారు.

కాజల్ అగర్వాల్, అక్షర హాసన్‌తో జోడి

కాజల్ అగర్వాల్, అక్షర హాసన్‌తో జోడి

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, అక్షరహాసన్, వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి తొలుత తలా 57 అని ప్రచారం జరిగింది. ఈ చిత్రానికి శివ దర్శకుడు కాగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. వేదాలం చిత్రం తర్వాత వస్తున్న వివేగమ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

English summary
Ajith Kumar latest movie is Vivegam, Producer Thyagarajan confirmed it as April 14 release. Now there is yet another buzz hitting airs that movie will be hitting screens on August 10.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu