»   » అలా చేస్తే ప్రేక్షకుల మొహం మొత్తేస్తుంది :తమన్నా

అలా చేస్తే ప్రేక్షకుల మొహం మొత్తేస్తుంది :తమన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ఎక్కువ పాళ్లు గ్లామర్‌గా నటించినా ప్రేక్షకుల మొహం మొత్తేస్తుంది. అలాగే నటనతోపాటు గ్లామర్‌ లేకపోయినా హీరోయిన్లు రాణించడం కాస్త కష్టమే. సమపాళ్లలో గ్లామర్‌గా నటిస్తే బోర్‌ కొట్టదని నా ఉద్దేశం. ఎందుకంటే ప్రేక్షకులు గ్లామర్‌నే కోరుకుంటారు. దీంతోపాటు భిన్నమైన పాత్రలు చేయడానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నానని తమన్నా చెప్పుకొచ్చింది.

తన పాత స్టార్‌డంను వెతుక్కోవడం కోసం మళ్లీ కోలీవుడ్‌కు దారివేసుకున్న నటి తమన్నా. రెండేళ్ల క్రితం తిరుగులేని హవాను చాటుకున్న తమన్నా.. ఇప్పుడు మళ్లీ యువ హీరోల సరసన నటించేందుకు ఉవ్విళ్లూరుతోంది. తాజాగా 'వీరం' చిత్రంలో తొలిసారిగా 'తల' అజిత్‌కు జత కడుతోంది. తన అందచందాలతో దక్షిణాది పరిశ్రమను ఆకట్టుకున్న తమన్నా.. అదే మ్యాజిక్‌ను 'హిమ్మత్‌వాలా'తో బాలీవుడ్‌లోనూ ప్రదర్శించింది.

అయితే అక్కడ పరిస్థితి తారుమారైంది. సినిమా తగిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో వెనకడుగు వేయాల్సి వచ్చింది. కానీ అక్షయ్‌కుమార్‌, సైఫ్‌ అలీఖాన్‌ వంటి హీరోలతో హిందీలో మళ్లీ నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం అజిత్‌ నటిస్తున్న 'వీరం' గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది.

తమన్నా కి తెలుగులో ఆఫర్స్ లేకపోయినా తమిళంలో వెలిగిపోతోంది. అక్కడ ఆమె రెండు కోట్లు దాకా డిమాండ్ చేస్తోంది. కార్తీ నటించిన 'సిరుతై' తరువాత తమిళ సినిమాలకు కాస్త బ్రేకిచ్చేసింది తమన్నా. ఆ సినిమా తరువాత తమిళ చిత్రసీమవైపు చూడని ఈ ముద్దుగుమ్మ కొంత గ్యాప్ తరువాత ప్రస్తుతం అజిత్ హీరో గా నటిస్తున్న 'వీరమ్' చిత్రంలో నటిస్తోంది. తెలుగు సినిమాలకు కోటి ఇరవై లక్షలు తీసుకుంటున్న ఈ భామ అజిత్ సినిమా కోసం ఏకంగా రెండు కోట్లు పారితోషికం తీసుకుంటోందని చెన్నై చిత్ర వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో నాగచైతన్య తో చేసిన 'తడాఖా' తరువాత కాస్త జోరు తగ్గించిన ఈ సుందరి హిందీలో మాత్రం స్పీడు పెంచేసింది.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ సరసన ఎంటర్టైన్మెంట్ అనే చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. ఫర్హాడ్ -సాజిద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రమేష్ ఎస్ తౌరని నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విజయంపై తమన్నా చాలా నమ్మకం పెట్టుకుంది. అలాగే సైఫ్ అలీఖాన్‌కి జోడీగా హమ్ షకాల్ అనే మరో చిత్రంలో తమన్నా ఖరారైందని విశ్వసనీయ సమాచారం. సినిమాలో మరొక నటి ఇషా గుప్త కూడా నటించనుంది. ఈ చిత్రాలే కాకుండా ఖరారు కాని ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో ఉన్నాయని,ఆమె దృష్టి పూర్తిగా అక్కడే కాన్సర్టేట్ చేసిందని అంటున్నారు.

English summary
Ajith Kumar 54th movie with Tamannaah, which was recently titled as Veeram, has come up with the first look of the movie. The flick is directed by Siruthai Siva and slated to release for Pongal Festival (January 2014). Veeram crew is working on their toes to wrap up the movie by this year end. The movie will be a feast to Ajith fans for the Pongal festival. The flick started its shoot with the working title as Vinayagam Brothers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu