»   » శ్రీదేవి బ్రతికుండగా ఆ కోరిక తీర్చలేదు..ఇప్పుడైనా తీరుస్తావా అజిత్!

శ్రీదేవి బ్రతికుండగా ఆ కోరిక తీర్చలేదు..ఇప్పుడైనా తీరుస్తావా అజిత్!

Subscribe to Filmibeat Telugu
అజిత్ ని కోరిక తీర్చమంటూ ఇలా ?

బోనికపూర్, శ్రీదేవి దంపతులకు కేవలం కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు.. అన్ని చిత్ర పరిశ్రమల్లో వీరికి మంచి స్నేహితులు ఉన్నారు. శ్రీదేవి మరణించిన తరువాత లక్షల్లో అభిమానులు కడసారి చూపుకోసం ముంబై వెళ్లగా, వేల సంఖ్యలో సెలెబ్రిటీలు, శ్రీదేవి, బోనీ సన్నిహితులు శ్రీదేవి అంతిమ యాత్రకు తరలివెళ్లారు. శ్రీదేవి తన కుమార్తె జాన్వీ కపూర్ తొలి చిత్రాన్ని చూడకుండానే మరణించింది. ఇలా శ్రీదేవికి తీరని కోరికలు చాలానే ఉన్నాయి. శ్రీదేవి, బోని దంపతులకు తమిళ స్టార్ హీరో అజిత్ కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అజిత్ విషయంలో శ్రీదేవికి ఓ కోరిక తీరకుండానే మిగిలిపోయినట్లు తెలుస్తోంది.

 ఇండియా మొత్తం శ్రీదేవికి ఆప్తులే

ఇండియా మొత్తం శ్రీదేవికి ఆప్తులే

శ్రీదేవికి కేవలం బాలీవుడ్ లో మాత్రం కాక దేశం మొత్తం మీద అన్ని చిత్ర పరిశ్రమల్లో అభిమానులు ఉన్నారు. శ్రీదేవి తన సుదీర్ఘమైన సినీ కెరీర్ లో చాలా మంది సన్నిహితులని సొంతం చేసుకుంది.

 అనూహ్య మరణం

అనూహ్య మరణం

శ్రీదేవికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఆమె మరణం ఊహించినది కాదు. యావత్ దేశాన్ని అలరించిన ఈ అతిలోక సుందరి ఊహించని పరిస్థితుల మధ్య దుబాయ్ లో మృతి చెందింది.

 తీరని కోరికలు ఎన్నో

తీరని కోరికలు ఎన్నో

శ్రీదేవి తన తుది శ్వాస వరకు భర్త, పిల్లల భవిషత్తు గురించే ఆలోచించింది. తల్లిచాటు బిడ్డలుగా జాన్వీ, ఖుషి ఎదుగుతున్న సమయంలో శ్రీదేవి వారికీ దూరం అయింది. జాన్వీ తొలి చిత్రాన్ని వెండి తెరపై ఆస్వాదించకుండానే శ్రీదేవి మరణించడం దురదృష్టకరం. ఇలా శ్రీదేవికి తీరని కోరికలు చాలా ఉన్నాయి.

 అజిత్ కూడా ఆప్తుడే

అజిత్ కూడా ఆప్తుడే

తమిళ హీరో అజిత్ కూడా శ్రీదేవి ఫ్యామిలీకి మంచి సన్నిహితుడు. శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో అజిత్ గెస్ట్ రోల్ లో నటించాడు.

శ్రీదేవి, బోని కోరిక

శ్రీదేవి, బోని కోరిక

అజిత్ హీరోగా పెట్టి ఓ సినిమా నిర్మించాలని చాలా రోజుల క్రితమే బోనికపూర్, శ్రీదేవి అనుకున్నారట. కానీ అజిత్ బిజీగా ఉండడంతో కుదరలేదు. అంతలోనే శ్రీదేవి మరణించారు. కాగా శ్రీదేవి మరణం తరువాత ఈ చిత్రంలో తొలి అడుగు పడినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

త్వరలోనే నిర్మించాలని

త్వరలోనే నిర్మించాలని

అజిత్ తో సినిమా చేయాలని బోనికపూర్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు ప్రాధమిక దశలోనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

విశ్వాసంతో బిజీగా

విశ్వాసంతో బిజీగా

అజిత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో రూపొందబోయే విశ్వాసం చిత్రంతో బిజీకాబోతున్నాడు. ఈ నెల నుంచే ఈ చిత్రం పార్రంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తరువాత అజిత్ బోనికపూర్ నిర్మాణంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గతంలోనే హామీ

గతంలోనే హామీ

బోనికపూర్ నిర్మాణంలో నటిస్తానని అజిత్ గతంలో శ్రీదేవి సమక్షంలో హామీ ఇచ్చాడట. కానీ ప్రాజెక్ట్ మొదలయ్యే సమయానికి శ్రీదేవి అనూహ్యంగా మృతి చెందారు. బోని కపూర్ ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యంతో సినిమా చేయడానికి అజిత్ అంగీకరించినట్లు తెలుస్తోంది.

English summary
Ajith may do a film for Boney Kapoor. Now Ajith is busy with Viswasam
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu