»   » డిసెంబర్ 6న అజిత్, రాణా, నయనతార ‘ఆట ఆరంభం’(ఫోటోలు)

డిసెంబర్ 6న అజిత్, రాణా, నయనతార ‘ఆట ఆరంభం’(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అజిత్, ఆర్య, రానా, నయనతార, తాప్సీ ముఖ్యపాత్రల్లో విష్ణువర్థన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం 'ఆరంభం'. అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సంచలన మల్టీస్టారర్ చిత్రం ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రాన్ని తెలుగులో 'ఆట ఆరంభం' పేరుతో ఓమిక్స్ క్రియేషన్స్ అధినేత శీనుబాబు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. తాజాగా ఈచిత్రం విడుదల తేదీ ఖరారు చేసారు. డిసెంబర్ 6న ఈచిత్రాన్ని విడుదల చేసేందుక సన్నాహాలు చేస్తున్నారు. భారీ తారాగణం ఉన్న ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అజిత్ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. రాణా, నయనతార, తాప్సి కూడా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భరీగా ఉన్నాయి. స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు....

నిర్మాత మాట్లాడుతూ...

నిర్మాత మాట్లాడుతూ...

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'తమిళంలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడం ఆనందంగా వుంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుందనే
నమ్మకం వుంది.

 ప్రధాన ఆకర్షణలు

ప్రధాన ఆకర్షణలు

అజిత్, ఆర్య నటన, నయనతార, తాప్సీ అందచందాలు, విష్ణువర్థన్ టేకింగ్ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. డిసెంబర్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 100 కోట్లు

100 కోట్లు

తమిళ్ స్టార్ అజిత్, నయనతార జంటగా తమిళ్‌లో విడుదలైన ‘ఆరంభం' సూపర్ హిట్ టాక్‌తో రికార్డులు సృష్టిస్తూ 100 కోట్ల మార్కును అందుకుంది.

హిందీలోకి కూడా...

హిందీలోకి కూడా...

దక్షిణాది బాషలో ఒక సినిమా హిట్టైందంటే బాలీవుడ్ హీరోలు దాని రీమేక్ రైట్స్ కోసం వాలిపోతున్నారు. తాజాగా అదే పరిస్ధితి ఆరంభం కు కనిపిస్తోంది. అజిత్,నయనతార కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ పోటీ పడుతోందని
సమాచారం. ముఖ్యంగా అక్షయ్ కుమార్ ఈ చిత్రం రైట్స్ ఎట్టి పరిస్ధితుల్లోనూ సొంతం చేసుకోవాలని ఉత్సాహపడి పోటీలో ఉన్నారు. నిర్మాత ఎ.ఎం రత్నంతో బాలీవుడ్ కి చెందిన ఓ పెద్ద నిర్మాణ సంస్ధ టాక్స్ జరుపుతోందని తెలుస్తోంది.

English summary
Thala Ajith scored a big hit in Tamil with the film ‘Arrambam’. The movie is now getting ready to hit the screens in Andhra Pradesh as ‘Aata Arambham’ and efforts are being made to release the film on December 6th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu