»   » నిండు గర్భిణి: థియేటర్లో దర్శనమిచ్చిన హీరో అజిత్ వైఫ్

నిండు గర్భిణి: థియేటర్లో దర్శనమిచ్చిన హీరో అజిత్ వైఫ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ తమిళ హీరో అజిత్ నటించిన ‘ఎన్నై అరిందాల్' చిత్రం నిన్న గ్రాండ్‌గా విడుదలైంది. సినిమా ఫస్ట్ డే, మొదటి ఆట చూసేందు అజిత్ ఫ్యాన్స్ పోటీ పడ్డారు. అభిమానులు మాత్రమే కాదు....అజిత్ భార్య, మాజి నటి శాలిని కూడా తొలి రోజు తొలి ఆట చూసేందుకు థియేటర్‌కు రావడం గమనార్హం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇలాంటి మామూలే కదా...అని తేలిగ్గా తీసేయొద్దు. ప్రస్తుతం ఆమె 8 నెలల నిండు గర్భవతి. అయినా సరే సినిమా చూడటానికి చెన్నైలోని ఆల్బర్ట్ థియేటర్ కు వచ్చారు. అజిత్ సినిమాలను అభిమానించే వారిలో ఆమె భార్య శాలిని కూడా ఒకరు. ఆమె రాకతో థియేటర్లో సందడి వాతావరణం నెలకొంది. అభిమానుల నినాదాలతో థియేటర్ హోరెత్తిపోయింది.

Ajith's Pregnant Wife Shalini At Theatre

‘ఎన్నై అరిందాల్' సినిమా విషయానిస్తే..గౌతం మీనన్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో అనుష్క, త్రిష హీరోయిన్లు. సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడి ఇపుడు రిలీజైంది. ‘ఐ' సినిమాతో పోటీ పడటం ఇష్టం లేకనే సినిమాను వాయిదా వేసారి అప్పట్లో టాక్. కానీ ఈ సినిమా అపుడు విడుదలయి ఉంటే ‘ఐ' సినిమాకు భారీ నష్టం జరిగి ఉండేదని సినిమా చూసిన వారు అంటున్నారు. ఆ రేంజిలో ఉంది మరి ఈ సినిమా టాక్.

విడుదలైన తర్వాత ఈ చిత్రం భారీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. గతంలో అజిత్ నటించిన సినిమాలు వరుసగా విజయాలు అందుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రంపై ముందు నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉండటంతో అజిత్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

ఇక ఈ చిత్రాన్ని తెలుగులో "ఎంతవాడు కానీ.." అనే పేరుతో డబ్ అయి విడుదల చేయబోతున్నారు. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ కి యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పడే సినిమా హిట్ అవుతుందని అంచనాలు వేసారు. అంతా అనుకున్నట్లే జరిగింది. అజిత్ మూడు వైవిధ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, త్రిషలు తమ అందచందాలతో ఆకట్టుకున్నారు.

ఆర్టిఫిషియల్‌ లుక్‌తో కనిపించకూడదనే ఉద్దేశంతో అజిత్‌ కుమార్‌ ఈ సినిమాలోనూ తెల్లజుట్టుతోనే కనిపించారు. ఇది పోలీస్‌ యాక్షన్ ఎంటర్టెనర్. అదే సమయంలో గౌతం మీనన్ చిత్రాల నుండి ఆశించే రొమాంటిక్ సీన్లు కూడా మెండుగానే ఉన్నాయట. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సీన్లు మంచి కిక్ ఇస్తాయని అంటున్నారు త్వలోనే తెలుగు రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

English summary
Tamil star hero Ajith's wife, former heroine Shalini, has stunned one and all at Albert theatre in Chennai. She stepped into the theatre in the shouts and whistles of Ajith's fans who are waiting to watch the first show of his latest movie "Yennai Arindhaal".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu