»   » ఇది అజిత్ సినిమా ("వీరుడొక్కడే'' ప్రివ్యూ)

ఇది అజిత్ సినిమా ("వీరుడొక్కడే'' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమిళనాట అజిత్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. హిట్,ఫ్లాపులకు సంభందం లేకుండా మంచి కలెక్షన్స్ తో చిత్రాలు ముందుకువెళ్తూంటాయి. అలాగే ప్రేమలేఖ చిత్రం నుంచి అజిత్ కి తెలుగులోనూ మార్కెట్ ఏర్పడింది. దాంతో ఆయన చిత్రాలన్నీ ఇక్కడ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ఆరంభం రిలీజ్ చేసారు. ఇప్పుడు మళ్లీ ఈ చిత్రంతో ముందుకు వస్తున్నారు. తమిళంలో భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ వీరమ్. ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలై ఘనవిజయం సాధించి అజిత్ కెరియర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్రం రూపొందటంతో ఇక్కడా మంచి అంచనాలే ఉన్నాయి.

 Ajith’s Veerudokkade preview

నిర్మాత తుమ్మలపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ... 'ట్రాఫిక్' చిత్రంతో నిర్మాతగా తన బాధ్యత పెరిగిందని, ఆ మంచిపేరును కాపాడుకోవడం కోసం ప్రస్తుతం ఈ చిత్రాన్ని బాధ్యతాయుతంగా అందిస్తున్నామని, ప్రస్తుతం పరిశ్రమ పరిస్థితి సరిగాలేని కారణంగా ఏంచేయాలి అనుకుంటున్న సమయంలో ఈ 'వీరం' చిత్రానికి సంబంధించిన ఆలోచన వచ్చిందని, ట్రాఫిక్ కంటే పది రెట్లు పెద్ద సినిమా అని తెలియడంతో ఆలస్యం చేయకుండా ఈ డీల్‌ను ఓకే చేసుకున్నానని తెలిపారు. సుమారు 150 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం తెలుగులోకి తీసుకురావాలంటే ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేయాల్సి వచ్చిందని, ఈ చిత్రంలో హీరో అజిత్ అయితే, మరో హీరో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అనీ, ఆయనిచ్చిన బాణీలు, ఆర్‌ఆర్ చిత్రాన్ని అద్భుతంగా మలిచాయని ఆయన తెలిపారు. తమన్నా అందాల కోసం రెండోసారి చిత్రం చూస్తారని, డబ్బింగ్ కార్యక్రమాలు అందంగా విజయా ప్రొడక్షన్స్‌వారే ముస్తాబు చేశారని, డబ్బింగ్ సినిమా చూస్తున్న అనుభూతి ఎక్కడా కనపడదని, దాదాపు 300 థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నామని ఆయన వివరించారు.

దర్శకుడు శివ మాట్లాడుతూ.. '' శివా... గ్రామీణ వాసన నిండేలా.. కథలో బంధుత్వం, స్నేహితులు ఎక్కువగా ఉండేలా ఓ మంచి కథను ఎంచుకో. నటించాలనుందని అజిత్‌ చెప్పారు. అప్పుడే 'వీరం' కథ వినిపించా. ఆయన వెంటనే ఒప్పేసుకున్నారు. అజిత్‌ను మాస్‌గా చూడాలనుకునే అభిమానులకు ఇది పెద్ద పండగే. ట్రైలర్ లో 'మీ అన్నయ్య.. గంభీరమైన వ్యక్తి.. చాలా మంచివాడు.. హ్యాండ్‌సమ్‌..' అంటూ అజిత్‌ గురించి తమన్నా చెప్పే మాటలు ట్రైలర్‌కు హైలెట్‌గా నిలుస్తున్నాయి.

దేవిశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ. '' అజిత్‌ సినిమాకు తొలిసారి సంగీతం సమకూర్చడం చాలా సంతోషంగా ఉంది. స్టూడియోకు వచ్చిన అజిత్‌.. అన్ని వాద్య పరికరాలను వాయించారు. అంతేకాకుండా కొన్ని ట్యూన్ల రూపకల్పనను దగ్గరుండి చూశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమిది''అని చెప్పారు.

సంస్ధ: భీమవరం టాకీస్
నటీనటులు: అజిత్, తమన్నా, ప్రదీప్ రావత్, నాజర్, సంతానం తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్,
కెమెరా: వెట్రి,
నిర్మాత: రామ సత్యనారాయణ,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ.
విడుదల తేదీ: 21,మార్చి 2014.

English summary
Ajith’s mass action entertainer ‘Veeram’ is being dubbed into Telugu and this movie is going to be known as ‘Veerudokkade’ here. Tamanna is the heroine in this movie and Devi Sri Prasad has composed the music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu