»   » మగ‌బిడ్డకు జన్మనిచ్చిన అజిత్-షాలిని దంపతులు (ఫోటోస్)

మగ‌బిడ్డకు జన్మనిచ్చిన అజిత్-షాలిని దంపతులు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టార్ హీరో అజిత్ అభిమానులకు గుడ్ న్యూస్. అజిత్, షాలిని మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే పాపకు జన్మనిచ్చిన ఈ స్టార్ కపుల్ తాజాగా మగ బిడ్డను కన్నారు. సోమవారం తెల్లవారు ఝామున 4.30 గంటలకు షాలిని పండంటి మగ బిడ్డను ప్రసవించింది. తల్లి బిడ్డా క్షేంగా ఉన్నారు. ఈవిషయం తెలిసిన వెంటనే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

అజిత్, శాలిని ఇద్దరూ సినీ నటులు. పెళ్లికి ముందే పలు చిత్రాల్లో కలిసి నటించారు. వీరిద్దరూ 'అమరకలమ్' అనే తమిళ చిత్రంలో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ సమయంలో వీరిపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. చివరకు మీడియా సాక్షిగా వారు తమ ప్రేమ విషయాన్ని ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 24, 2000లో వివాహం చేసుకున్నారు.

అజిత్, శాలిని మతాంతర వివాహం చేసుకున్నారు. అజిత్ కుమార్ హిందూ అయితే, శాలిని క్రిస్టియన్. వీరి వివాహం హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగింది. పెళ్లి తర్వాత కూడా శాలిని తను కమిటైన రెండు ప్రాజెక్టులను పూర్తి చేసారు. ఆ తర్వాత సినిమాకు గుడ్ బై చెప్పారు. వీరికి 2008 జనవరి 8వ తేదీన పాప జన్మించింది. తమ కూతురుకి అనౌష్క అనే పేరు పెట్టుకున్నారు.

మగ బిడ్డ

మగ బిడ్డ

సోమవారం తెల్లవారు ఝామున 4.30 గంటలకు శాలిని మగ బిడ్డను ప్రసవించింది.

అనౌష్కతో అజిత్, శాలిని

అనౌష్కతో అజిత్, శాలిని

తమ ముద్దుల కూతురు అనౌష్కతో స్టార్ కపుల్ అజిత్, శాలిని.

కూతురుతో శాలిని..

కూతురుతో శాలిని..

ఆ మధ్య ఓ కార్యక్రమానికి హాజరైన శాలిని....తన కూతురు అనౌష్కతో ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

లిటిల్ అనౌష్క

లిటిల్ అనౌష్క

అజిత్, శాలినిల కూతురు అనౌష్క ఎంతో ముద్దొస్తోంది కదూ....

English summary
Ajith's wife and former actress Shalini gave birth to the couple's second child, a baby boy, at 4.30 am on Monday. Ajith was by the side of Shalini and clicked pictures of his junior's birth.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu