»   » స్టైలిష్ పోలీస్ రివేంజ్ స్టోరీ (అజిత్ 'ఎంతవాడు గానీ' ప్రివ్యూ)

స్టైలిష్ పోలీస్ రివేంజ్ స్టోరీ (అజిత్ 'ఎంతవాడు గానీ' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అజిత్ చిత్రాలకు తొలి నుంచి తెలుగులో మంచి మార్కెట్టే ఉంది. ప్రేమలేఖ అజిత్ గా ఆయన ఇక్కడ సుపరిచితుడే. అలాగే ఏమి మాయ చేసావే వంటి సూపర్ హిట్ ని తెలుగులో ఇచ్చిన దర్శకుడుగా గౌతమ్ మీనన్ కు సైతం తెలుగులో మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఎంతవాడు గానీ' ( 'ఎన్నై అరిందాల్'). దానికి తోడు...త్రిష,అనుష్క హీరోయిన్స్ కావటంతో ఇక్కడ ఓ రేంజిలో ఓపినింగ్స్ ని సైతం ఎక్సపెక్ట్ చేస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


కథగా ...కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఒక పోలీసు అధికారి ఎలా పగ తీర్చుకున్నాడనే కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. మూడు షేడ్స్‌ వున్న క్యారెక్టర్‌లో అజిత్‌ నటించారు. అనుష్క ఫారిన్‌ నుంచి వచ్చిన మోడ్రన్‌ గర్ల్‌గా, త్రిష సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన క్లాసికల్‌ డాన్సర్‌గా నటించారు. ఇంతకుముందు తమిళ్‌లో హీరోగా చాలా సినిమాల్లో నటించిన అరుణ్‌ విజరు ఈ చిత్రంలో అజిత్‌కి ఈక్వల్‌గా వుండే నెగెటివ్‌ క్యారెక్టర్‌ చేశారు. ఆయన సరసన పార్వతి నాయర్‌ నటించారు. ఆశిష్‌ విద్యార్థి, సుమన్‌ కీలకమైన పాత్రలు పోషించారు.


గతంలో గౌతమ్ మీనన్...కాక కాక్క (ఘర్షణ) , వెట్టియాడు వెలియాడు (వేటాడు వెంటాడు) చిత్రాలను పోలీస్ కథలతో తెరకెక్కించారు. ఇప్పుడు ఇది మూడో ప్రాఛైజ్ గా చెప్పి రిలీజ్ చేసారు. అలాగే... ఆ రెండు చిత్రాల్లో హీరో పాత్రకు..ఎక్సెటెన్షన్ గా ఈ చిత్రం రూపొందించానని గౌతమ్ చెప్పారు.


నిర్మాత ఎఎం రత్నం మాట్లాడుతూ- ''గౌతమ్ మీనన్ కొత్తశైలిలో తెరకెక్కిం చారు. అజిత్ నటన, అనుష్క త్రిషల గ్లామర్ ప్రధాన ఆకర్షణ. హారిస్ జయరాజ్ చాలా మంచి స్వరాలందించారు. తమిళంలో లాగానే తెలుగులోనూ ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా'' అన్నారు.


దర్శకుడు మాట్లాడుతూ... ''హేరిస్‌ జైరాజ్‌ ఈ చిత్రానికి ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ఇందులో ఏడు పాటలు వుంటాయి. అజిత్‌ కాంబినేషన్‌లో నేను చేసిన ఈ సినిమా తమిళ్‌లో ఘనవిజయం సాధించింది. తెలుగులో కూడా ఈ సినిమా మరో సెన్సేషనల్‌ ఫిలిం అవుతుంది'' అన్నారు.


Ajith Yentha Vaadu Gaani Movie preview

బ్యానర్: శ్రీసాయిరామ్‌ క్రియేషన్స్‌
నటీనటులు : అజిత్, త్రిష,అనుష్క, అర్జున్ విజయ్, పార్వతి నాయర్‌ , ఆశిష్‌ విద్యార్థి, సుమన్‌ తదితరులు
అడిషనల్ స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్,త్యాగరాజన్ కుమార్ రాజా
ఛాయాగ్రహణం: ఎస్.ఆర్. ఖాదిర్, డాన్ మ్యాచుర్
ఎడిటింగ్ : ఆంధోని
సంగీతం: హారిస్ జయరాజ్
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ మీనన్‌
నిర్మాణ పర్యవేక్షణ : ఎ.ఎం.రత్నం
నిర్మాత : ఎస్‌.ఐశ్వర్య
విడుదల తేదీ: 22, ,మే 2015.

English summary
Goutham Vasudev Menon have come up with another crime thriller movie. Yentha Vaadu Gaani, A Telugu movie Dubbed from Tamil Movie named “Yennai Arindhaal“. It is written and directed by Gautham Vasudev Menon popularly known as Gautham Menon and produced by S.Aishwarya.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu