»   »  బాలకృష్ణ పాత్రలో...పూరీ జగన్నాథ్ కొడుకు!

బాలకృష్ణ పాత్రలో...పూరీ జగన్నాథ్ కొడుకు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయాపటి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న 'లెజెండ్' చిత్రంలో దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ నటించబోతున్నారు. ఈచిత్రంలో ఆకాష్ చిన్నతంలో బాలకృష్ణ పాత్రను పోషిస్తున్నాడు.

ఆకాష్ ఇప్పటికే పలు చిత్రాల్లో ఇలాంటి పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. బుజ్జిగాడు చిత్రంలో చిన్ననాటి ప్రభాస్ పాత్రలో, గబ్బర్ సింగ్ చిత్రంలో చిన్ననాటి పవన్ కళ్యాణ్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పుడు 'లెజెండ్' చిత్రంలో చిన్ననాటి బాలకృష్ణ పాత్రలో కనిపించబోతున్నాడు.

'లెజెండ్' చిత్రం షూటింగ్ ప్రస్తుతం విశాఖ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటో ఒకటి లీకైంది. రూ. 20 లక్షల ఖర్చుతో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన హార్లే డేవిడ్సన్ బైకు బాలయ్య ఆ ఫోటోలో దర్శనమిచ్చారు. ఈ ఫోటోలో బాలయ్య లుక్ చూస్తుంటే....దర్శకుడు బోయపాటి ఆయన్ను 'సింహా' రేంజిలో సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తారు. పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను.

English summary
Filmmaker Puri Jagannath's son Akash will play the younger version of Balakrishna in upcoming Telugu political-drama "Legend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu