పోరీతో పూరి కొడుకు రచ్చకి డేట్ ఫిక్సైంది
హైదరాబాద్ :మరాఠీలో విజయం సాధించిన చిత్రం 'టైమ్ పాస్'. తెలుగులో 'ఆంధ్రా పోరి' అనే పేరుతో పునర్ నిర్మిస్తున్నారు. ఆకాష్ పూరి, ఉల్కా గుప్తా జంటగా నటించారు.రాజ్‌మదిరాజు దర్శకత్వం వహించారు. రమేష్ ప్రసాద్ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో పాటలు విడుదల చేస్తారు. మే 15 న ఈ చిత్రం విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ ''మా సంస్థలో తెరకెక్కిన 30వ చిత్రమిది. రాజ్‌మదిరాజును 'రుషి'తో మేమే పరిచయం చేశాం. ఈ సినిమానూ చాలా బాగా తీశాడు. ఈ నెలలోనే పాటలను విడుదల చేస్తాము''అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''32 రోజుల పాటు జరిగిన ఒకే షెడ్యూల్‌తో సినిమాను పూర్తి చేశాం. ఈ సినిమా నాకో బాధ్యత. నాకు తొలి అవకాశం ఇచ్చిన సంస్థలో మళ్లీ పనిచేయడం ఆనందంగా ఉంది. పూరి జగన్నాథ్ ఎంతో నమ్మకంతో ఆకాష్‌ను మాకు అప్పగించారు. ఆకాష్ బాగా నటించాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. జై అందించిన బాణీలు తప్పకుండా అందరినీ ఆకట్టుకొంటాయి''అన్నారు.
డా.శ్రీకాంత్, పూర్ణిమ, ఈశ్వర్‌రావ్, అరవింద్‌కృష్ణ,ఊర్మిళ కనిత్కర్, ఉత్తేజ్, అభినయ, శ్రీతేజ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం:ప్రవీణ్ వనమాలి, సంగీతం:డా.జె, ఆర్ట్:రాజీవ్ నాయర్, డ్యాన్స్:చంద్రకిరణ్, సాహిత్యం:సుద్దాల అశోక్‌తేజ,రామజోగయ్యశాస్త్రి, కిట్టు విస్సా ప్రగడ, కృష్ణ మదినేని, చక్రవర్తుల.


Click it and Unblock the Notifications











