»   » వీడియో : వెన్నెల కిషోర్ తో అఖిల్ ఫన్నీ క్రికెట్

వీడియో : వెన్నెల కిషోర్ తో అఖిల్ ఫన్నీ క్రికెట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నాగార్జున అక్కినేని తనయుడు అఖిల్ అక్కినేని అఖిల్ సినిమా ద్వారా హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం బుధవారం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్రానికి సంభందించిన ప్రమోషన్స్ వేగం పెంచారు. అందులో భాగంగా వెన్నెల కిషోర్ తో కలిసి ఫన్నీగా క్రికెట్ ఆడారు. ఆ వీడియోని ఫేస్ బుక్ ద్వారా అభిమానులకు అందించారు. మీరూ ఆ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

Playing cricket with Vennela Kishore was a totally different experience for me :) Watch this interesting match!

Posted by Akhil Akkineni on 10 November 2015

శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో అఖిల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం 'అఖిల్‌'. ఈ నెల 11న 'అఖిల్‌' ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అగ్నిగోళాన్ని సైతం తన చేతుల్లో ఇముడ్చుకోగల ధీశాలి ఆ కుర్రాడు. భగ భగ మండే సూర్యుడిని తలపించే అతని పయనం ఎక్కడి నుంచి ఎక్కడిదాకా సాగిందో తెలియాలంటే 'అఖిల్‌' చిత్రాన్ని చూడాల్సిందే.

Akhil : Akhil funny cricket with Vennela Kishore

నిర్మాత నితిన్‌ మాట్లాడుతూ ''అఖిల్‌ హీరోగా నటించిన తొలి చిత్రమిది. అందుకే సినిమాపై భారీ అంచనాలున్నాయి. వాటికి దీటుగా సినిమాని తెరకెక్కించారు దర్శకుడు. అఖిల్‌ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అనూప్‌ రూబెన్స్‌, తమన్‌ అందించిన గీతాలకి మంచి ఆదరణ లభించింది. సినిమా అదే తరహాలో ప్రేక్షకులకు చేరువవుతుంది. మా నిర్మాణ సంస్థకి మరపురాని చిత్రంగా 'అఖిల్‌' నిలుస్తుంది''అన్నారు.

శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Akhil tweeted, "Playing cricket with Vennela Kishore was different experience for me. Watch this interesting match"
Please Wait while comments are loading...