»   »  రెండో చిత్రం ఖరారైంది: అఫీషియల్ ప్రకటన చేసిన అఖిల్ అక్కినేని!

రెండో చిత్రం ఖరారైంది: అఫీషియల్ ప్రకటన చేసిన అఖిల్ అక్కినేని!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అక్కినేని నాగార్జున వారసుడుగా ఇటీవల 'అఖిల్‌' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసాడు నాగార్జున చిన్న కుమారుడు అఖిల్. 'మనం' చిత్రం చివర్లో అఖిల్ గెస్ట్ పాత్రలో స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండే అతనిపై భారీ హైప్ వచ్చింది.

అఖిల్ స్టైల్, యాటిట్యూడ్ చూసిన చాలా మంది ఫ్యూచర్లో టాలీవుడ్లో పెద్ద స్టార్ హీరోగా ఎదుగుతాడని, మహేష్ బాబు రేంజికి వస్తాడని లెక్కలు వేసారు. ఆ హైప్ కారణంగానే వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ తొలి సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. అయితే ఆ చిత్రం ఎవరూ ఊహించని విధంగా భారీ ప్లాప్ అయింది.

అప్పటి వరకు ఆకాశంలో ఉన్న అఖిల్ హైప్ ఒక్కసారిగా నేలమీదకొచ్చేసింది. అందుకే రెండో సినిమా విషయంలో అఖిల్ చాలా మల్లగుల్లాలు పడ్డారు. అఖిల్ ప్లాపును జనాలు పూర్తిగా మరిచిపోయే వరకు వేచి చూసాడు. ఈ గ్యాపులో చాలా కథలు విన్నాడు, అక్కినేని ఫ్యామిలీ చాలా మంది దర్శకులను వడపోసింది.

అయినా ఎలాంటి కథ ఎంచుకోవాలి, ఏ దర్శకుడితో చేయాలి అనే సందిగ్ధం. మొదటి సినిమా ప్లాప్ కావడంతో... రెండో సినిమా విషయంలో ఏదో తెలియని భయం. ఈ సినిమా కూడా దెబ్బ కొడితే అఖిల్ ఫ్యూచర్ మీద భారీ ప్రభావం పడుతుందనే ఆందోళన.

ఎట్టకేలకు అఖిల్ రెండో సినిమాపై ఓ నిర్ణయానికి వచ్చారు. అఫీషియల్ ప్రకటన చేసారు.

ట్విట్టర్ ద్వారా

ట్విట్టర్ ద్వారా


తన తదుపరి చిత్రాన్ని విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో చేస్తున్నట్లు స్పష్టం చేశారు అఖిల్. ఇంతకు ముందు విక్రమ్ కుమార్ అక్కినేని ఫ్యామిలీకి ‘మనం' రూపంలో మరుపురాని హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

థ్రిల్లింగ్

థ్రిల్లింగ్


‘నా అభిమాన దర్శకుడు విక్రమ్‌కుమార్‌తో నా తదుపరి చేస్తున్నానని చెప్పడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. త్వరలోనే ఇది సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ ప్రాజెక్టు కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా అని ప్రకటించారు.

క్షమించాలి

క్షమించాలి


రెండో సినిమాను ఆలస్యంగా చేస్తున్నందుకు అభిమానులు క్షమించాలి. కానీ వేచి చూసినందుకు తగిన ప్రతిఫలం వస్తుందని ఆశిస్తున్నా' అని ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు.

నాగార్జున హ్యాపీ

నాగార్జున హ్యాపీ


సెప్టెంబర్ మాసం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇదే నెలలో నా ఇద్దరు ఫేవరెట్ డైరెక్టర్లతో... నా ఇద్దరు కుమారుల సినిమాలు ప్రకటిస్తున్నాం. కళ్యాణ్ కృష్ణ(సోగ్గాడే చిన్ని నాయనా) తో అఖిల్, విక్రమ్ కుమార్(మనం)తో అఖిల్ సినిమా చేస్తున్నాడని నాగార్జున అన్నారు.

English summary
"Very thrilled to announce that will be going on floors very soon with one of my fav Vikram Kumar ! Super excited about this project." Akhil tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu